226)సహస్రాక్షాః -
వేయినేత్రములు గలిగినవాడు
దివ్యమైన దృష్టిగలవాడు
అన్నిటినీ గ్రహించగలవాడు
సర్వలోక దృష్టిలోనుండువాడు
శ్రీ విష్ణు సహస్రనామాలు!ఉమా!
227)సహస్రపాత్ -
సహస్ర పాదములు గలవాడు
శీఘ్రగమనము చేయువాడు
విశ్వమంతా చరించగలవాడు
సర్వాంతర్యామిగానుండువాడు
శ్రీ విష్ణు సహస్రనామాలు ఉమా!
228) ఆవర్తనః -
జగత్ చక్రమును తిప్పువాడు
సంసారమును నడిపించేవాడు
తోడుగానుండగలిగిన వాడు
తనవైపు మరలించువాడు
శ్రీ విష్ణు సహస్ర నామాలు ఉమా!
229) నివృత్తాత్మా-
విశ్వంతో సంబంధం లేనివాడు
సందేహ నివృత్తిచేయగలవాడు
నిస్సంశయముగా నుంచువాడు
నమ్మకమును కలిగించువాడు
శ్రీ విష్ణు సహస్ర నామాలు ఉమా!
230) సంవృతః -
అవిద్యను తొలగించువాడు
మాయను తీసివేయగలవాడు
జ్ఞానము పంచుటకు సమర్థుడు
పొరలను తొలగించినట్టివాడు
శ్రీ విష్ణు సహస్రనామాలు ఉమా!
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి