సుప్రభాత కవిత - బృంద
కడలంటి మనసులో
అలలంటి భావమేదో
కలలంతా నింపేసి
మొదలంటా  తడిపేసి

ఆనందంలో ముంచేసి
అంతరంగం మురిపించి
అంతే వేగంగా జారిపోతూ
అక్కడక్కడా మెరిపిస్తూ

అభిమానపు నురగలంటి
జ్ఞాపకాలు  వదిలేసి
జారిపోయే కాలంలా
తలపులతో తరించమని

వగచి వేచినా తిరిగిరాని
గడచిపోయిన మధురమైన
అమృత ఘడియలు అతుకులేసి
బొంత కుట్టుకుని దాన్నే కప్పుకుని

తలచి తలచి ఆనందించమని
పిలిచి పిలిచి గుర్తు చేసే
మరపురాని మమతలేవో
మధురమైన గీతిలాగా

మనసు వీణను మీటిపోయే
మౌనరాగపు మధురిమ
ఎదను నింపి వెల్లువై
వెలితి తోచని వెలుగు తెచ్చే

వేకువకు

🌸🌸 సుప్రభాతం🌸🌸


కామెంట్‌లు