అద్దం
నిన్ను చూపుతుంది
నీషోకులు చూపుతుంది
అద్దం
ఉన్నది ఉన్నట్టుచూపుతుంది
నిజరూపాన్ని ప్రతిబింబిస్తుంది
అద్దం
అమాయకమయినది
ఆలోచనలులేనిది
అద్దం
గుండెలాంటిది
పగిలితే అతకదు
అద్దం
అందమైనది
అవసరమైనది
కొందరి
చెక్కిళ్ళు
అద్దంలాయుంటాయి
కొందరి
మనసులు
అద్దంలాయుంటాయి
కొందరి
బ్రతుకులు
అద్దంలాయుంటాయి
కొందరు
అద్దాలమేడలలో
నివసిస్తుంటారు
అద్దం
ఆడవాళ్ళకు
అతిప్రీతిపాత్రము
అందమైన
జీవితము
అద్దాలసౌధము
మీరూ
అద్దంలోచూడడండి
అవలోకనంచేసుకోండి
అద్దం
అభిమానంగాపిలిచింది
అందంగాకవితనువ్రాయించింది
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి