సమర్ధ సద్గురువు -సి.హెచ్.ప్రతాప్

 సాయి దివ్య నామం సకల పాప హరణం
అదియే మోక్ష తీరం, వేద సారం, అతి మధురం
మంచి నీటితో దీపములను వెలిగించి
బేహారుల హృదయములలో అజ్ఞానంధకారములను తొలిగించి
దివ్యమైన జ్ఞాన మార్గమును జూపి
బ్రోచిన సమర్ధ సద్గురువు శ్రీ సాయినాధులు
అత్యాశతో పరుగులు తీయ యత్నించిన
దాము అన్నాకు హిత బోధ గావించి
శాశ్వత పరమానందమునకు దారి జూపిన
దేవదేవుడు కలియుగ దైవం శ్రీ సాయి
కొలిమిలో పడ్డ కొమ్మరి బిడ్డను
తన చేతులు కాల్చుకొని
రక్షించిన వైనం కరుణకు నిదర్శనం
ఎందరినో శ్రేయోమార్గంలో నడిపించిన
సమర్ధ సద్గురువు శ్రీసాయి.
నిరుపేదలకు ధన పెన్నిధి
గురు భక్తులకు దత్తునిగా
నమ్మి కొలిచిన భక్త జనావళికి
ఆశ్రిత కల్పవృక్షమై
భాసిలిన్న త్రిమూర్తి స్వరూపం  
పరిశుద్ధ పరమేశ్వర అవతారం శ్రీ సాయి
 
కామెంట్‌లు