హమ్మో! పరీక్షలు!! అచ్యుతుని రాజ్యశ్రీ

 టెన్త్ ఇంటర్ పరీక్షలు మొదలు ఔతాయని తెలియగానే సాయమ్మలో ఏదో ఖంగారు భయం.సఫాయి పనిచేసే ఈమె బడికివచ్చి టీచర్ ని కల్సింది." నీ బిడ్డ మంచి గా చదువుతోంది." అని భరోసా ఇచ్చారు టీచర్స్ అంతా.ఇక  3వక్లాస్ చదివే బేబీ వాళ్ళ అమ్మ కి మహా టెన్షన్.మరి  ఎ.సి.బస్సు స్కూల్ ఏడాదికి రెండు లక్షల ఫీజ్.ఆపొరుగున ఉన్న టీచర్ దగ్గరకు ట్యూషన్ కి పంపుతుంది.ఆరోజు ట్యూషన్ లో టీచర్ క్విజ్ పోటీ పెట్టింది. సాయమ్మ కొడుకు శివా 7వక్లాస్ టకటకా జవాబులు చెప్పడం జరిగింది.కారణం వాడు రోజూ లైబ్రరీ లో న్యూస్ పేపర్ చదువుతాడు." టీచర్!  రోజూ బడికి వెల్తే మన ఆయుస్సు పెరుగుతుంది హాయిగా తోటివారితో ఆటపాటలతో ఒంటరితనం పోతుంది.మంచి కూరగాయల తో ఆహారం తీసుకున్నంత బలం శక్తి వస్తుంది అని నార్వే దేశంలోజరిగిన పరిశోధనలు తేల్చి చెప్పాయి."" శభాష్ శివా!! రోజూ బడికెల్తే  పాఠాలు టకటకా నోటికి వస్తాయి . బుర్రలో తిష్ఠ వేస్తాయి. అలాగే దివ్యాంగులు చేసే కృషి ఆత్మ విశ్వాసం మనకు పారా ఒలింపిక్స్ లో పతకాలు తెస్తోంది.18 ఏళ్ల లింగప్ప సరూర్ నగర్ స్టేడియంలో పరుగుపందాలకు ప్రాక్టీస్ చేస్తున్నాడు.డిగ్రీ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాడు.కరెంట్ తీగలతో రెండు చేతులు కోల్పోయాడు.వరంగల్లోరాష్ట్రస్థాయి పోటీల్లో బంగారు పతకం సాధించిన ఘనుడు.రోజు ఉదయం సాయంత్రం 3 గంటల చొప్పున ప్రాక్టీస్ చేస్తున్నాడు." పిల్లలు ఉత్సాహంగా వింటున్నారు.టీచర్ ప్రశ్న వేసింది""ఈఏడాది జ్ఞానపీఠ్ అవార్డు ఎవరికొచ్చింది?" " టీచర్! 58 లో ఆఅవార్డ్ ఇద్దరికి వచ్చింది.21లక్షల నగదు వాగ్దేవి విగ్రహం ఇస్తారు. హిందీ సినీ కవి గుల్జార్ గా ప్రసిద్ధి చెందిన సంపూరన్ సింగ్ కుర్రాడు వచ్చింది.ఇకరెండో వ్యక్తి శ్రీరామభద్రాచార్య.చిత్రకూట్ లోని తులసీపీఠ్ స్థాపించారు.22భాషల్లో పండితుడు.240 పుస్తకాలు రాశారు.ఆయన అసలుపేరు గిరిధర్ మిశ్ర.2 నెలల పసికందు గా ఉన్నపుడు ట్రకోమా వల్ల కంటిచూపు పోయింది.తాతవద్ద విద్యాభ్యాసం మొదలుపెట్టారు.5 వ ఏట భగవద్గీత 8 వ ఏట రామ చరిత మానస్ గడగడా అప్పజెప్పి నేడు ఆధ్యాత్మిక గురువు గా రాణిస్తున్నారు " చకచకా చెప్పింది ఉష. అంతే అంతా చప్పట్లు కొట్టారు." దివ్యాంగులు రాణిస్తున్నారు.సర్వాంగులు భయపడితే ఎలా??" టీచర్ మాటల్తో  అంతా" మాకు భయంలేదు.మోదీజీ పరీక్షాపె చర్చ విన్నాం  అని అరిచారు🌺
కామెంట్‌లు