స్నేహం-రేణుక- ఎనిమిదవ తరగతి-ZPHS హవేలీ ఘనపూర్-మెదక్ జిల్లా-6302411016

  అనగనగా రాంపూర్ అనే గ్రామంలో సింధు, కృష్ణవేణి, రాధ అనే ముగ్గురు స్నేహితులు ఉండేవారు. వారిలో కృష్ణవేణి, సింధు ఎక్కువ స్నేహంగా ఉండేవారు. వారిద్దరు ఎక్కువ స్నేహంగా ఉండడం రాధకు నచ్చేది కాదు. ఎలాగైనా సరే వారిద్దరి మధ్యన గొడవ పెట్టాలని రాధ అనుకుంది. 
               ఒకరోజు కృష్ణవేణి పాఠశాలకు యాబై రూపాయలు తెచ్చుకుంది. ఆ విషయం రాధకు తెలుసు. పాఠశాలలో మధ్యాహ్న భోజన సమయంలో కృష్ణవేణి, సింధు ఇద్దరు కలిసి భోజనానికి వెళ్తారు. అదే సమయంగా భావించి అక్షయ ఎవరు లేని సమయం చూసి కృష్ణవేణి బ్యాగ్ నుంచి యాబై రూపాయలు తీసి సింధు బ్యాగ్ లో పెడుతుంది. భోజనం చేసి వచ్చిన కృష్ణవేణి బ్యాగులో యాభై రూపాయలు లేవు. ఏమి చేయాలో అర్థం కాక కృష్ణవేణి ఏడుస్తుంది.
             కృష్ణవేణిని రాధ దగ్గర తీసుకుని ఓదారుస్తుంధి. అందరి బ్యాగులు సింధు చెక్ చేస్తుంది. ఎవ్వరి బ్యాగులో కూడా యాబై రూపాయలు దొరకలేదు. చివరకు అక్షయ నీ బ్యాగ్ కూడా చెక్ చెయ్ అని సింధును అంటుంది. సింధు బ్యాగులో యాభై రూపాయలు దొరుకుతాయి. అందరూ ఆశ్చర్యపోతారు. రాధ మనసులోనే నవ్వుతుంది. కానీ కృష్ణవేణి తన ఆలోచన అప్పటికప్పుడే మార్చుకుని, నేను సింధు బ్యాగ్ లో డబ్బులు పెట్టి మర్చిపోయాను అంటుంది. సింధు ఆశ్చర్యపోతుంది. రాధ తను తప్పు తెలుసుకుంటుంది. స్నేహమంటే ఇలాగే ఉంటుందని గ్రహించి తిరిగి వారిద్దరితో కలిసి ఉండసాగింది.
నీతి: సమయస్ఫూర్తితో  సమస్య పరిష్కారం అవుతుంది

కామెంట్‌లు