ఏక సంధాగ్రాహి వేంకట రాజుగారు;- ఏ.బి ఆనంద్,ఆకాశవాణి,విజయవాడ కేంద్రం,9492811322
 మన్యంలో వీరులందరూ చేరి విడిదిలో సభ చేసి రాజును ఏం జరిగింది అని అడిగారు  దేవుని ధ్యానించి  జై జై ద్వారలతో వీరదొరలకు రాజు ఈ విధంగా చెప్పుకుంటూ వచ్చాడు  అన్నలారా మనలను అందరూ పొగిడారు  మన్యము స్వతంత్ర మందినది  అని పొగిడారు కానీ  భారత భూమి కాపాడడానికి మీ మార్గం ఆపదలను తెచ్చిపెడుతుంది సుమా అని  మదనపడ్డారు  అహింసయే దానికి మార్గం అన్నారు  నమ్మి ఆ సిద్ధాంతానికి కట్టుబడమని పోరాడు అన్ని మనసులు ఒక రీతిగా ఉండవు  అందరూ ఐక్యంగా చేసే అహింస వ్రతం అది  మనకు ధైర్యాన్నిస్తుంది  ఆయుధాల పోరు బాటను విడవమని కోరినాడు బాపూజీ. ఇప్పుడిప్పుడే ప్రజలలో ఐక్యత పెరుగుతుంది శాంతి అహింసల సత్యాగ్రహాల శక్తి తెలిసి వచ్చింది అన్ని దేశాలు ఈ మార్గాన్ని అనుసరించడానికి కృత నిశ్చయంతో ఉన్నది  దానికి అపకృతి చేయవద్దుఅని వారు కోరారు ఏదేమైనప్పటికీ  మనము ఈ మన్య ప్రాంతంలో చైతన్యానికి తీసుకొచ్చాం మనం వెలిగించిన మన్య విప్లవ జ్యోతి ఈనాడు ఇంటింటా వెలుగుతూనే ఉంది మనం పూరించడం మన్య శంఖపు ద్వారా స్వాతంత్ర్య నినాదం  అన్ని దిశల వ్యాపించింది  భారతీయులు కోపిస్తే మనం బ్రతకజాల మోని తెల్లవారికి తేటతెల్లమైంది  ఏది సాధించడానికి మనం అలా చేసామో ఆ విజయాన్ని సాధించాం మన జీవితాలు ధన్యమైనవి  భరతావనిలో మన త్యాగ చరిత శాశ్వతంగా నిలిచి ఉంటుంది. ఎదురుగా వచ్చి పోరాడడానికి బెదిరిపోయిన  దొరలు దొంగ చాటుగా ప్రజలను హింసిస్తూ ఉన్నారు  మనలను పట్టించిన వారికి మంచి బహుమతులు ఇస్తామని  ప్రకటనలు కూడా చేస్తున్నారు  అమాయకులను పట్టి ఆశలను కల్పించి  లొంగని వారిని బాధిస్తున్నారు  మాల కోసం వెతుకుతూ మన పల్లె సీమల చాటుమాటున అగ్ని పెడుతూ ఉన్నారు  విప్లవంపేర అభివృద్ధి నుంచి జనుల ఆస్తులు చేస్తున్నాడు   దొరల చేతలతో ప్రజలు కష్టాలు పడుతున్నారు మన  కార్యకలాపాల వల్ల  మనలను ఎదిరించలేకనే మళ్లీ మన వారిని దొంగ చాటుగా ప్రజలను బాధిస్తున్నారు. విప్లవం  సాగినంతవరకు వారు దానిని విడువరు  మనకు వారికి మధ్య సామాన్యులు  ఆహుతి అవుతున్నారు.
కామెంట్‌లు