శూర్పణఖ;- ఏ.బి ఆనంద్,ఆకాశవాణి,విజయవాడ కేంద్రం,9492811322.
 ఇలా మైథిలి మౌనసాధన మూర్తి అయితే శూర్పణఖ ఆశా ప్రతిహింసలకు ప్రతిరూపం జానకి మితబాషిణి మాట్లాడినా కూడా మృదుల మంజుల మధురవాక్కులే  వెలువడతాయి. శూర్పణఖ పురుషుడు మాట్లాడినట్లే మాట్లాడుతుంది ఈ విధంగా వాల్మీకి మహర్షి మహిళామణుల్లో ఎంత వైవిధ్యాన్ని పెట్టాడో అంతే లోతుగా పరిశీలించాడు మహిళలు కావచ్చు పురుషులు కావచ్చు అన్ని పాత్రలలోనూ అదే విధంగా ఆచరించాడు మహర్షి  ప్రతిపాత్రకు ప్రత్యేక ప్రతిపత్తి ఉంటుంది ప్రత్యేక పాత్రకు సార్థకత ఉంటుంది. ప్రతి పాత్రకు చరితార్థత ఉంటుంది  వాల్మీకి మహర్షి ప్రతి అక్షరాన్ని సూక్ష్మాతి సూక్ష్మ పరిశీలన చేసి వ్రాశాడు ఈ పై విశిష్ట లక్షణాలన్నీ పురోధి చేసుకుని మనకు దర్శనమిస్తాయి అని అనడంలో ఏ మాత్రం సందేహం లేదు. ఎక్కడ వెతికితే అక్కడ వజ్రాలు మల్లులు మనీ మాణిక్యాలు వైఢూర్యాలు లభిస్తాయి
సర్వేజనాః సుఖినోభవంతు.
ఆదిశంకరాచార్యుల వారు మనకు అద్వైత సిద్ధాంతాన్ని తెలియజేశారు  అది ఎంతమందికి అర్థం అవుతుంది  భగవంతుడు లేడు  వారిని పూజించే భక్తుడు లేడు ఉన్నది ఒకటే  ఏకం  సత్ అని చెప్తున్నాడు  కానీ మనకు  రాముడు ఉన్నాడు కృష్ణుడు ఉన్నాడు  జీసస్ ఉన్నాడు  అల్లా ఉన్నాడు సాయిబాబా కూడా ఉన్నాడు  వీరందరూ ఉన్నారు కనుక వాటిని మనం పూజిస్తున్నాం  వారు లేరు నీవు లేవు అన్నదానికి అర్థం లేదు అన్న వ్యాఖ్యతో ఆయనను ప్రత్యక్షంగా మేము చూస్తున్నాము  నేను జీవించే ఉన్నాను నేను లేకపోయినట్లయితే పూజలు పురస్కారాలు ఎలా జరుగుతాయి  అనితపించే వాడికి  సమాధానం అంత త్వరగా   చిక్కదు  విషయం అంత త్వరగా జీర్ణం కాదు.
బ్రహ్మ సత్యం జగత్ మిధ్య  బ్రహ్మ శాశ్వతం జగత్తు అశాశ్వతం  అని కూడా పెద్దలు చెప్పారు  బ్రహ్మ పదార్థం ఏదైతే ఉందో అది లేకపోయినట్లయితే ఈ జగత్తు లేదు  అన్ని ప్రపంచాలు కలిసిన దానిని జగత్ అంటున్నాం  ఈ బ్రహ్మ పదార్థాన్ని ఆంగ్లంలో ఆటం అని అంటారు  అణువు ఏదైతే ఉన్నదో  దానిని విచ్చిన్నం చేయడం మనవల్ల కాదు  అది మూల పదార్ధం  జ అంటే  పుట్టుక  గతి అంటే మరణించుట  జగతి అంటే పుట్టిన దగ్గర నుంచి మరణించేంతవరకు  ఉన్న చక్రం  ఉదయం లేస్తాం అంటే పుట్టాం  రాత్రికి నిద్రిస్తాం మరణించాం  ఈ పుట్టినరోజు మరణించేంత వరకు మనం చేస్తున్న నిత్య కృత్యాన్ని నిర్దేశించింది శంకరాచార్య   మనం చేసే ప్రతి కార్యం శంకరాచార్యుల వారు చెప్పినదే. మాటలో మర్యాద మనన్న  మనసులో భక్తి    బుద్ధిలో వ్యాస వాల్మీకి మహర్షుల హృదయాలను  అధ్యయనం చేయగలిగిన వివేకం  విద్యార్థులకు మంచి గురువు  స్నేహానికి ఆత్మీయుడు  ప్రాణానికి ప్రాణం ఇచ్చే మిత్రుడు పింగళి పాండురంగారావు గారు  భారత రామాయణాలలో ఉన్న  స్త్రీ పాత్రలను గురించి రాసిన  మానసిక విశ్లేషణతో కూడిన  వ్యాసాలను మీకింతవరకు  అందించిన  గొప్ప వ్యక్తి పాండురంగారావు గారికి హృదయపూర్వక నమస్సులు అర్పిస్తూ  కలకాలం వారి  మైత్రిని అభిలషిస్తూ  

కామెంట్‌లు