అమ్మ చేతి ముద్దలో...;- -గద్వాల సోమన్న,9966414580
అమ్మ చేతి ముద్దలో
అనురాగమే ఉన్నది
ఆమె జోలపాటలో
ఆహ్లాదమే ఉన్నది

తల్లి చేయు సేవలో
త్యాగగుణమే ఉన్నది
ఆమె చూపు ప్రేమలో
వెన్నెల కురియుచున్నది

అమ్మ చెప్పు మాటలో
రాచబాట ఉన్నది
ఆమె మనసు తోటలో
ఆనందమే ఉన్నది

అమ్మంటే దేవతరా!
ఆమె చెంత స్వర్గమురా!
అమ్మ మనసు ఎరిగి మనము
మసలుకుంటే దీవెనరా!

కామెంట్‌లు