రకరకాల బంధాలు;- -గద్వాల సోమన్న,9966414580
కన్న పేగు బంధము
మిన్న కదా సృష్టిలో
అన్నాచెల్లెల బంధము
ఆదర్శం అవనిలో

గురు శిష్యుల బంధము
నిశ్చయముగా భాగ్యము
కాపాడుకో! సతతము
వర్ధిల్లును జీవితము

స్నేహితుల మధ్య బంధము
మరణమంత శక్తిగలది
చెరిగిపోక, చెదిరిపోక
శాశ్వతంగా  నిలుచునది

రకరకాల బంధాలు
పెనువేయు అనుబంధాలు
బ్రతుకున సత్సంబంధాలు
నిలబెట్టు కుటుంబాలు

కామెంట్‌లు