సమైక్య రాగం;- -గద్వాల సోమన్న,9966414580
]మొక్కలను నాటుదాం
తరువులను పెంచుదాం
అలముకున్న కాలుష్యం
తక్షణమే తరుముదాం

జన క్షేమం కోరుదాం
ప్రగతి బాట నిర్మిద్దాం
మూఢ నమ్మకాలనిల
భూస్థాపితం చేసేద్దాం

పిరికితనం వీడుదాం
పౌరుషమే నింపుదాం
సజ్జనుల స్నేహంలోన
సమైక్యత సాధిద్దాం

దేశ భక్తి చూపిద్దాం
దేశ కీర్తి నిలబెడుదాం
మహాత్ముల నీడలోన
విలువలెన్నొ నేర్చుదాం

కామెంట్‌లు