456)సుముఖః -
===========
ప్రసన్నవదనముతో నున్నవాడు
విద్వాంసుడు తానైయున్నవాడు
చక్కని వర్చస్సుతోనున్నవాడు
గరుత్మంతునియంశకారకుడు
శ్రీ విష్ణు సహస్రనామాలు ఉమా!
457)సూక్ష్మః -
సర్వత్రా వ్యాపించినట్టివాడు
అదృశ్యముగా నుండినవాడు
పరమాణువుగానే యుండువాడు
ఆధ్యాత్మికశక్తి తానైనవాడు
శ్రీ విష్ణు సహస్ర నామాలు ఉమా!
458)సుఘోషః -
చక్కని ధ్వనినీయగలవాడు
మంచిని చాటించుచున్నవాడు
దివ్యశబ్దములు వినిపించువాడు
వేదముతెలియజెప్పునట్టివాడు
శ్రీ విష్ణు సహస్రనామాలు ఉమా!
459)సుఖదః -
సుఖానుగ్రహమును ఇచ్చువాడు
సౌకర్యములను ఒసగువాడు
సౌఖ్యమును కలిగించునట్టివాడు
భక్తులను ఆదరించినవాడు
శ్రీ విష్ణు సహస్ర నామాలు ఉమా!
460)సుహృత్ః -
ప్రతిఫలమును కోరనట్టివాడు
దేనినీ ఆశించలేనివాడు
సుహృద్భావన కలిగినవాడు
ఉపకారమును చేయగలవాడు
శ్రీ విష్ణు సహస్రనామాలు ఉమా!
(సశేషం )
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి