శ్రీ విష్ణు సహస్రనామాలు (బాల పంచపది )-ఎం. వి. ఉమాదేవి
376)శ్రీగర్భః -

సకలైశ్వర్యములున్నవాడు
గర్భంలో నిధులున్నవాడు
శ్రీలక్ష్మిని ధరించినట్టి వాడు
సంపదలిచ్చునట్టి వాడు 
శ్రీ విష్ణు సహస్రనామాలు ఉమా!
377)పరమేశ్వరః -

ఉత్కృష్టమైనట్టి వాడు
ఈశ్వరులలో అగ్రగణ్యుడు
పరమము తానైనట్టి వాడు
పరమేశ్వరాకృతి గలవాడు 
శ్రీ విష్ణు సహస్ర నామాలు ఉమా!
378)కరణమ్ -

జగత్తుని ఉత్పత్తిచేయువాడు
సాధనము తానే అయినవాడు
పరికరము వలే ఉండువాడు
కరణము తానైనట్టి వాడు 
శ్రీ విష్ణు సహస్రనామాలు ఉమా!
379)కారణమ్ -

జగత్తుకు కారణమైనవాడు
ప్రాణులను నడిపించేవాడు
చర్యలకు మూలమైనవాడు
చరాచరములను తీర్చువాడు 
శ్రీ విష్ణు సహస్రనామాలు ఉమా!
380)కర్తా -

సమస్తకార్యాలు జరుపువాడు
కర్మలకు కర్త అయినవాడు
పనులను సంకల్పించువాడు
కర్మల కారకుడైనట్టి వాడు 
శ్రీ విష్ణు సహస్రనామాలు ఉమా!

(సశేషం )
కామెంట్‌లు