హరీ!శతకపద్యములు.;- టి. వి. యెల్. గాయత్రి.పూణే. మహారాష్ట్ర.
 75.
చంపకమాల.
తరువులఁ గూల్చుచున్ జనులు దండిగ కట్టిరి దివ్యహర్మ్యముల్
కరువులు కాటకంబులిట కాల్చగ నాపద లుప్పతిల్లగన్ 
ధరణికి ముప్పువచ్చె జలధారల దృశ్యము నొందెనయ్యొ!మా
కిరవగు మార్గమున్ దెలిపి నీ ధరఁ నిల్పవె పచ్చగన్ హరీ!//
76.
చంపకమాల.
కలియుగమందునన్ ఖలులు కత్తులు నూఱుచు రెచ్చిపోవగన్
నలుదెసలందునన్ గనగ నైతిక ధర్మము లుప్తమాయె ని
ర్మలమగు బుద్ధులన్ విడిచి మంచిని లోకులు విస్మరించ నీ
విలువలు నేర్పరావ!వినిపించవె నీదు సుబోధలన్ హరీ!//
కామెంట్‌లు