సుప్రభాత కవిత ; - బృంద
ఉరకలువేసే ఉత్సాహం
పరుగులు తీసే సంబరం
తెరలు తొలగించే అంబరం
ఇలను తాకే తొలికిరణం

జ్యోతికలశపు కాంతులతో
మేఘమాలల చెలిమికి
రంగులు నింపిన నింగిలో
కొత్త వెలుగుల ఊరేగింపు

శ్వాసలో ధ్యాసను ఉంచి
చూపులో భానుని నింపి
మాపులో వెతలను మరచి
రేపుకై కలలను పరచి

చింతలు లేని జీవితమిమ్మని
వంతలు ఇక చాలు వద్దని
సైకతంలా జారిపోయే క్షణాలతో
వింతగ కరిగిపోయే కాలానికి

అపూర్వమైన సమయమిచ్చి
అద్భుతమైన అనుభూతులిచ్చి
అచిరకాలం ఆరోగ్యంగా
ఆనందాలను పోగుచేసుకొమ్మనే

వేడుకైన వేకువకు

🌸🌸 సుప్రభాతం🌸🌸
కామెంట్‌లు