451)సర్వదర్శిః -
సకలమును దర్శించుచున్నవాడు
విశ్వదర్శనమును చేయువాడు
అంతయును చూడగలిగినవాడు
చరాచర ప్రకృతి దార్శనికుడు
శ్రీ విష్ణు సహస్రనామాలు ఉమా!
452)విముక్తాత్మా -
స్వరూపవిముక్తి నొందినవాడు
ఆత్మను విడిచినట్టి వాడు
మనోబంధనములేనివాడు
స్వచ్ఛతమముగా నున్నవాడు
శ్రీ విష్ణు సహస్ర నామాలు ఉమా!
453)సర్వజ్ఞః -
బుద్ధదేవుడు తానైనవాడు
సర్వమూ తెలిసినట్టివాడు
సమస్తమూ ఎరిగినవాడు
సర్వజ్ఞత కలిగియున్నవాడు
శ్రీ విష్ణు సహస్రనామాలు ఉమా!
454)జ్ఞానముత్తమమ్-
ఉత్తమజ్ఞానం కలిగినవాడు
ఎరుకకలిగియున్నట్టి వాడు
రూపగుణముల సమన్వితుడు
జ్ఞానకారణమగుచున్న వాడు
శ్రీ విష్ణు సహస్ర నామాలు ఉమా!
455)సువ్రతః -
చక్కని వ్రతదీక్షగలవాడు
కార్యాచరణము చేయువాడు
సత్సంకల్పమున్నట్టి వాడు
సువ్రతునిగా నుండినవాడు
శ్రీ విష్ణు సహస్రనామాలు ఉమా!
(సశేషం )
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి