ప్రపంచమంతటా కలి కల్మషం
మానవాళిలో శాంతి, ఆనందం, దైవభక్తి దూరం
చింతనలు,మానసిక సమస్యలు, ఆందోళనలు ఉదృతం
ప్రతీ హృదయం ఒక మండే అగ్ని గుండం
పెచ్చు పెరుగుతున్న అసురీ లక్షణాలు
ప్రేమానురాగాలు, అప్యాయతానుభావాలు మటుమాయం
కలహం,విడిపోవడం , అసూయాద్వేషాలు కలి లక్షణం
కుల, మత,వర్గ,వైషమ్యాలు , కుటుంబాలలో అనైక్యత
పరస్పరాధికారాల కోసం పాట్లు పడే పాలకులు
ప్రజలను విభజించి, పాలిస్తూ తమ ఉనికి కోసం
వారిని రెచ్చకొట్టడమే వీరి సిద్ధాంతం
గొడుగుతొ వర్షం నుండి కాపాడుకునే విధంగా
ఏకాగ్రతతో,తీవ్రమైన సాధనతో, తపనతో
హృదయాన్ని కల్మషరహితంగా చేసుకుంటూ
స్నేహభావాలు పెంపొందించుకుంటూ
నిరంతరం భగవధ్యానంతో, సాత్విక భావాలతో
జీవించడానికి యత్నించడమే కలికల్మషానికి మందు
కలి కల్మషం;-సి.హెచ్.ప్రతాప్
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి