అలజడులన్ని సద్దుమణిగి
అంతరంగపు అంచులు చూసి
ఆనందం ఎక్కడుందో తెలిసి
తేటపడ్డ మనసులాటి ఏరు....
ఎన్ని చర్చలో ఎన్ని వాదనలో
ఎంత రణరంగమైన మనసో
ప్రశాంతత పొంది పయనపు
గతి నెరిగిన వివేకము వంటి
తొలివెలుగు
మార్చుకున్న నిర్ణయాలు
మార్పు పొందిన ఆలోచనలు
మాయలేవో అర్థమైన
మౌనం లాంటి పచ్చిక
దృడమైన చిత్తంలా
చదివి ముగించిన పొత్తంలా
మనుగడలో మర్మమేదో
మదిని వెలిగిన జ్యోతిలా
అసాంతం అనుభవసారం నిండి
అడుగడుగూ అప్రమత్తమై
అణువణువూ షరతులు లేని
మమతలు నింపే మనోహరమైన
ఉదయానికి
🌸🌸 సుప్రభాతం🌸🌸
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి