ప్రపంచ కవితా దినోత్సవ సందర్భంగా.. కావ్య సుధ" కు సాహితీ సత్కారం.
 ప్రపంచ కవితా దినోత్సవ సందర్భంగా ప్రముఖ కవి,  'ఆధ్యాత్మిక సాహిత్య సామ్రాట్' " కావ్యసుధ " ను  భారతీయ సాహిత్య అనువాద ఫౌండేషన్, విమల సాహితీ సమితి  సంయుక్త ఆధ్వర్యంలో హైదరాబాదు సిటీ కల్చరల్ హాలు లో గురువారం  భారతీయ సాహిత్య అనువాద ఫౌండేషన్ చైర్మన్ "కళారత్న" డాక్టర్ బిక్కి కృష్ణ అధ్యక్షతన జరిగిన కవి సమ్మేళనంలో డా. జెల్ది విద్యాధరరావు టిఆర్ఎస్ చే ఘనంగా సత్కరించారు.
 "కావ్యసుధ"  ఓ దైవమా... అంటూ  కవితా గానం చేసి సభను రంజింప చేశారు. ఆధ్యాత్మిక పరమైన అంశాలతో తాను చేస్తున్న కవిత్వ రచనల ను,సాహితీ సేవలను గుర్తించి తనను సన్మానించిన సాహితీ మూర్తులకు  కృతజ్ఞతలు తెలియజేశారు. తోటి కవి మిత్రులు,కవయిత్రులు కవిని అభినందించారు.
తిరుపతి ఎస్వీ యూనివర్సిటీ పూర్వాధ్యక్షులు పద్మశ్రీ కొలకలూరి ఇనాక్ ముఖ్య అతిథిగా,డాక్టర్.నాళేశ్వరం  శంకరం, డాక్టర్ రాజా వాసిరెడ్డి మల్లేశ్వరి, కవి పి శ్రీనివాస్ గౌడ్ విశిష్ట అతిథులుగా విచ్చేశారు. విమల సాహితీ సమితి అధ్యక్షులు డాక్టర్ జెల్ది విద్యాధరరావు ఐఆర్ఎస్ ప్రభృతులు  పాల్గొన్నారు.
ఆంధ్ర ప్రదేశ్ పూర్వ ఖనిజ అభివృద్ధి సమస్థ వైస్ చైర్మన్,  మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్.వి.డి. రాజగోపాల్ గారు రచించిన "అక్షరాలు అవే ! భావాలు ఎన్నో !! " కావ్య పరిచయం సమీక్ష తో సాహిత్య సమ్మేళనం రసవంతంగా ముగిసింది.
కామెంట్‌లు