జాతిపిత-సి.హెచ్.ప్రతాప్
 ప్రపంచానికిఆదర్శం
సత్యాగ్రహమే ఆయుధంగా
స్వాతంత్రమే లక్ష్యంగా
స్వదేశీయతే అభిమతంగా
సంకల్ప బలమనే శక్తితో
నిరాడంబరత, స్వాభిమానాలే ఆభరణాలుగా
రవి అస్తమించని బ్రిటీషు తో
అలుపెరుగని పోరాటం సల్పిన
స్పూర్తిప్రదాత మన బాపూజీ
చెడు వినొద్దు,కనొద్దు, మాట్లాడవద్దన
హితోపదేశం ఎప్పటికీ ఆదర్సం
బోసి నవ్వుల తాత
కొల్లాయి కట్టుకొని
దండి యాత్రతో దేశాన్ని కదిలించి
అహింసతో సాధించలేనిది
ఏమీలేదన్న సత్యాన్ని రుజువు చేసిన మన  బాపు
రేపే మరణిస్తానన్న ఆలోచనతో జీవించు..
శాశ్వతంగా ఉంటానన్న భావనతో విజ్ఞానాన్ని సంపాందించు
ఈ ప్రపంచంలో నువ్వు చూడాలనుకుంటున్న మార్పు
మొదట నీతోనే మొదలవ్వాలి
అంటూ హితోపదేశం చేసిన మన బాపు   
కామెంట్‌లు