శ్రీ విష్ణు సహస్రనామాలు (బాల పంచపది )ఎం. వి. ఉమాదేవి
426)విస్తారః

సమస్తలోకాలు విస్తరించినవాడు
విశ్వము తనయందేగలవాడు
వెలుగువలే ప్రసరించినవాడు
విస్తారమైన అంశలున్నవాడు 
శ్రీ విష్ణు సహస్రనామాలు ఉమా!
427)స్థావర స్థాణుః -

కదలుట మెదలుట లేనివాడు
ఉన్నచోటనే యున్నట్టివాడు
స్థావరములో నిలిచినవాడు
స్థాణుతత్వంతో నున్నట్టి వాడు 
శ్రీ విష్ణు సహస్ర నామాలు ఉమా!
428)ప్రమాణం-

సకలముకు ప్రమాణమైనవాడు
కార్యక్రమసంబంధమున్న వాడు
ఋజువును చూపించువాడు
సాక్షిభూతుడై యున్నవాడు 
శ్రీ విష్ణు సహస్రనామాలు ఉమా!
429)బీజమవ్యయం -

క్షయంకాని బీజమైనవాడు
హేతువుగలిగినట్టి వాడు
బలమును నిలిపినవాడు
బుద్ధికారణముగా నున్నవాడు
శ్రీ విష్ణు సహస్ర నామాలు ఉమా!
430)అర్థః -

అందరిచే కోరబడిన వాడు
ప్రయోజనం సమకూర్చువాడు
అర్థింపబడుచున్నట్టి వాడు 
అర్థము చేకూర్చునట్టి వాడు
శ్రీ విష్ణు సహస్రనామాలు ఉమా!

(సశేషం )
కామెంట్‌లు