ఇంతకు.. పదింతలు...! - కోరాడ నరసింహా రావు!
నీటి నుండి పుట్టిన ప్రాణులం
 నీటితో జీవనం...! 

సృష్టి లో ఒక వంతె  నేల.. 
 మూడొంతుల నీరే... ఐనా.. 
 త్రాగు నీటికి ఇక్కట్లు..!! 

మనిషి స్వయం కృతానికి... 
 మితి మీరిన స్వార్ధ సుఖానికి
 చేసిన సవరించు కోలేని తప్పు   లకుఅనుభవిస్తున్నపాప ఫలం! 

కొండలు కరిగి పోయాయ్... 
 మహారణ్యాలు అంతరించి పోయాయ్.. 
  సుఖాలకోసం కాలుష్యాలు... 
 అపరి మితమైపోయాయ్..! 
 జలకాలుష్యాలు పెరిగి పోయి
 భూగర్భ జలాలు అంతరించి...
 మంచి నీటి కోసం కట - కట.!! 

మన వారసు లకు... 
 కొట్లు కూడ బెట్టి ఇవ్వక పోయినా ఫరవాలేదు... 
 మంచి నీరు- స్వచ్చమైనగాలి
 మి గల్చక పోతే..., 
   మనల్ని ఆదేవుడే కాదు... 
 ఈ వార సులూ క్ష మించరు.. 
 సరికదా... శ పిస్తారు.. ।
  ఆ శా పా ల కు... 
  మన0 వారికి వారసులమై... 
 అంతకు పదింతలు అనుభ విస్తా0..!! 
       ******


ఫలిత0...! 
   భూగోళ0 నిప్పుల కుంపటి...
కామెంట్‌లు