హరీ!'శతకపద్యములు ;- టి. వి. యెల్. గాయత్రి.-పూణే. మహారాష్ట్ర
 65.
ఉత్పల మాల.
మోహపు పంకమందుబడి మున్గుచు లోకులు సొమ్మసిల్లి దా
సోహమటంచుచున్ బిలువ జూపెద వానిజరూప దీప్తి :సం
దేహము లేదు నిన్ గనిన ధీయుతవంతులై  భక్తులెల్ల నిన్
బోహణ పెట్టుచున్ గొలిచి ముక్తిని పొందెద రాహ!శ్రీహరీ!//
66.
ఉత్పలమాల.
మోసపు కార్యముల్ సలిపి పుణ్యపు మార్గము వీడి దుష్టతన్ 
గాసుల కాశబొంది నరకంబున కూలుచు మూఢతన్ జనుల్
చేసిన పాపముల్ తలచి చింతిలు చుండుట లోకరీతి నిన్
వాసిగ కొల్చినన్ దరుగు పాతక మెల్ల నిజంబుగన్ హరీ!//
కామెంట్‌లు