న్యాయాలు -453
కీటోద్ధార న్యాయము
****
కీట అనగా పురుగు.ఉద్ధార అనగా ఉద్ధరించుట, పైకి లేపుట ,కాపాడుట అనే అర్థాలు ఉన్నాయి.
ప్రవాహములో కొట్టుకుని పోవు పురుగులను తీసి ఒడ్డున పడవేస్తే,అవే బతికి బయటపడి ఏవో ఒక ఆధారమును చూసుకుని సుఖపడతాయి.
మనమే కాదు మనతో పాటు సమస్త జీవులు ఈ భూమిపై నివసిస్తూ వున్నాయి.ఈ భూమ్మీద బతికేందుకు మనకు ఎంత హక్కు వుందో ఇతర జీవరాశికి కూడా అంతే హక్కు వుందని గ్రహించాలి. అందుకే మన పెద్దలు భూతదయ కలిగి వుండాలి. వేటినీ హింసించవద్దు. వాటికీ ఆపదలు వస్తూ వుంటాయి. అలాంటి సమయంలో వాటిని మనం రక్షించాలి.
"కీటకోద్ధార న్యాయము" అంటే అదే.
అలా ఉపకారం, సహాయం చేయాలని పెద్దలు, చిన్నయసూరి లాంటి వారు ఎన్నో నీతి కథలు మనకు అందించారు.అందులోదే "చీమ -పావురం కథ". అది మనందరికీ తెలిసినప్పటికీ మరోసారి గుర్తు చేసుకుందాం.
ఓ చెట్టు మొదట్లో చీమలు, చెట్టు కొమ్మలపై పావురాలు నివసిస్తూ ఉండేవి.
ఓరోజు ఓ పావురం చెట్టు కొమ్మపై కూర్చుని వుంది. అది చూసిన వేటగాడు ఆ పావురాన్ని చూశాడు.దానిని వేటాడి కూర వండుకుని తినాలని అనుకున్నాడు.వెంటనే భుజానికి తగిలించుకున్న బాణం తీశాడు.
ఇదంతా గమనిస్తున్న చీమకు పావురం ఆపదలో వుందని అర్థమై పోయింది. గబగబా పాక్కుంటూ పోయి చంపడానికి బాణం ఎక్కుపెట్టిన వేటగాడిని గట్టిగా కుడుతుంది. 'అబ్బా!' అని కాలివైపు చూసుకోవడంతో బాణం గురి తప్పుతుంది. అది చూసిన పావురం 'హమ్మయ్య! బతికి పోయాను' అని సంతోషపడుతూ అక్కడ నుండి ఎగిరి పోతుంది.
వేటగాడు "అరెరే గురి తప్పిందే! అనుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోతాడు.
అప్పుడు పావురం చీమకు కృతజ్ఞతలు చెప్పుకుంటుంది.
ఓరోజు బాగా వర్షం పడటంతో చెట్టు కిందకు నీళ్ళు వచ్చాయి.ఆ ప్రవాహంలో చీమ కొట్టుకుని పోవడం పావురం చూసింది. వెంటనే చెట్టుకు ఉన్న పెద్ద ఆకును కోసి చీమకు దగ్గరగా వేసింది .చీమ ఆ ఆకు మీదకు చేరి ప్రాణాలను రక్షించుకుంటుంది.
ఇలా చీమ,పావురం ఆపదలో ఒకదానికి ఒకటి సహాయం చేసుకుంటాయి. అలా మనుషులు కూడా సహాయం చేసుకోవాలని, చేయాలని చెప్పడం కోసమే ఈ "కీటకోద్ధార న్యాయము"ను ఉదాహరణగా చెప్పారు.
ఒకోసారి సాటి వారికి సాయం చేయాలని ఉన్నా కొన్ని యిబ్బందులు ఎదురవుతూ వుంటాయి. అయినా వాటిని అధిగమించి చేసే ప్రయత్నం మానవీయతకు నిదర్శనం.
అలాంటిదే మహాభారతంలోని ఓ కథను చూద్దాం.
కౌరవుల వల్ల పాండవులు అడవుల పాలవ్వడం. ఒక సంవత్సరం అజ్ఞాత వాసం కూడా చేయాల్సి రావడం మనందరికీ తెలిసిందే కదా!
అలాంటి అజ్ఞాత వాస సమయంలో పాండవులు ద్రౌపదితో కలిసి మారు వేషాలు పేర్లతో విరాట్ రాజు కొలువులో చేరుతారు.
విరటుని భార్య సుధేష్ణాదేవి పరిచారికగా సైరంధ్రి పేరుతో వచ్చిన ద్రౌపదికి ఆశ్రయం ఇస్తుంది. కానీ ఆమె అందం చూసి తన భర్త మోహితుడు అవుతాడోనని లోలోపల భయం కలిగించినా ఆమెలోని మానవతా హృదయం ఆమెకు ఆశ్రయం ఇవ్వడానికే సిద్ధ పడుతుంది.
అయితే రావాల్సిన ఆపద భర్త వల్ల కాకుండా తోబుట్టువైన కీచకుని రూపంలో వస్తుంది.
అతడు చాలా దుర్మార్గుడు. కాదు కూడదు అని చెబితే తమ రాజ్యానికి ముప్పు వాటిల్లుతుందని భయపడుతుంది. అయినా తనవంతుగా కీచకుని మనసు మార్చేందుకు ఎన్నో రకాలుగా ప్రయత్నం చేస్తుంది.
సుధేష్ణ మంచి మనసును గ్రహించిన ద్రౌపది తన భర్తల సహకారంతో కీచకుని పీడ వదిలించుకుంటుంది.ఆ తర్వాత తమ కుమారుడైన అభిమన్యునికి విరాట్ రాజు, సుధేష్ణల కుమార్తె ఉత్తరను ఇచ్చి వివాహం జరిపిస్తుంది.
ఇలా సుధేష్ణాదేవి చేసిన ఉపకారానికి ప్రత్యుపకారం చేస్తుంది.
అంటే ఎదుటి వారు ఆపదలో ఉన్నప్పుడు సహాయం చేయడమనేది మానవీయ గుణం.అది ఈగనా?బూగనా?కుక్కనా? పిల్లినా? పిట్ట నా? చెట్టునా? ఏదైనా సరే? ఎవరైనా సరే ఆపదలో ఉన్నప్పుడు ఆదుకోవడం , రక్షించడం మన కర్తవ్యంగా భావించాలి.
అదండీ! "కీటకోద్ధార న్యాయం" లోని అంతరార్థం. దానిని సదా గమనంలో పెట్టుకొందాం. సహాయం చేయడంలో ముందు వరుసలో వుందాం.
ప్రభాత కిరణాల నమస్సులతో 🙏

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి