సుప్రభాత కవిత ; - బృంద
వెలుగు ధారగా వస్తుంటే
బ్రతుకు దారిలో పండుగే!
తొలగు భారమేదో మదిలో
వెదుకు తీరాలు చేరువే!

కదిలి వచ్చు కనక ధారలా
కరిగి పొంగు కరుణ వాగులా
తిరిగి తెచ్చు వైభవమేదో
కొదవలన్నీ వదిలిపోయేలా!!

పసిడి స్వప్నమేదో 
పండి  సత్యమయేలా
కోరిన స్వర్గమేదో
కొంగును నింపినట్టు

తరగని దోవల రాళ్ళన్నీ
వెలిగే బంగరు పువ్వులై
వింతగ తోచదా బాటంతా
కొత్తగ  వచ్చిన వేకువలో

అడుగు పడితే కదా
వెలుగు తోడయేది
వెతలకు వెరచి నిలబడితే
వేడుక ఎలా తెలిసేది?

సహనంతో సహగమనంలో
అహరహం పయనిస్తే
స్నేహంగా సహకరించి
అపజయం దరిచేరదుగా!

కొత్త పాఠాలు నేర్పే వేకువకు

🌸🌸సుప్రభాతం 🌸🌸

కామెంట్‌లు