కదంబం;- డా.నీలం స్వాతి,-చిన్న చెరుకూరు గ్రామం,-నెల్లూరు.-6302811961.
 పెద్దలు చెప్పిన సూక్తులను  చదివినప్పుడు దాని రచయిత ఎవరు అన్న విషయాన్ని  స్పష్టంగా తెలుసుకుని చదివినట్లయితే  అతను ఏ కాలంలో ఆ విషయాన్ని రచించాడు అన్న విషయం స్పష్టంగా తెలుస్తుంది  ఒక శ్లోకంలో  భోజనాల్లో రేగి పండు  ఉసిరి పండు సీతాఫలం లాంటివి  తీసుకోవచ్చు అని  అరటి పనులు మాత్రం ఏ పరిస్థితుల్లోనూ వాడవద్దు అని ఉంది  అది ఇప్పుడు రాసింది కాదు అనేది స్పష్టం  అరటిపండు చరిత్ర తెలిస్తే ఈ శ్లోకం  మనకెంతో ఆనందాన్నిస్తుంది  వారు రాసిన కాలంలో  అరటి పండు విష పదార్థాలు  దానిని తిన్నవాడు ఎవరు బ్రతికి లేరు  దానిని ఆధారం చేసుకుని ఆ రోజున ఆకలి  సమాజానికి నీతిగా చెప్పిన శ్లోకం అది.
ఆ తరువాత శాస్త్రజ్ఞులు దానిపై పరిశోధన చేసి  క్రాస్ బ్రీడ్ పద్ధతిలో  అనేక రకాలుగా మార్పులు చేసుకుంటూ వచ్చి  ఈరోజు మనం తింటున్న అరటిపండు  ఎంత అమూల్యమైనదో తెలుస్తుంది  నీకు విరోచనం కాకపోతే  మిగల పండిన  పై చర్మం కొంచెం నల్ల బడిన దినట్లయితే  ఎనిమిది గంటల్లో విరోచనం సాఫీగా అవుతుంది  నీకు విరోచనాలు అవుతూ ఉండి అవి తగ్గడం కోసం వైద్యుని దగ్గరికి వెళ్లి మందు తీసుకోవాల్సిన అవసరం లేకుండా  దోరగా ఉన్న అరటిపండును గనక నీవు సేవించినట్లయితే  ఎనిమిది గంటల్లో  ఆ సమస్య లేకుండా పోతుంది  కడుపునిండడానికి  పండిన అరటి పండు తినాలి  ఈ మూడు రకాలుగా  ఈ రోజున అరటి పండు మనకు  ఆరోగ్యాన్ని అందిస్తుంది  దీనికి కృషి చేసిన ప్రతి శాస్త్రజ్ఞుడు అభినందనీయుడే. భోజనం చేయడానికి కూడా కొన్ని పద్ధతులు చెప్పారు మన పెద్దవారు నీ  పొట్టను నాలుగు భాగాలు చేసి  రెండు పాదాలు కనపదార్థం  అంటే అన్నం లేదా చపాతీలు  ఒక భాగం  జలము  ఒక భాగం శూన్యం ఖాళీగా ఉండాలి  అలా భోజనం చేస్తే  చాలా మంచిది అంటారు  రాత్రిపూట కొంచెం ఎక్కువగా భోజనం చేయడం వల్ల మాత్రమే  మధుమేహం  రక్తపోటు మొబైల్ సిటీ మలబద్ధకం  లాంటి  రుగ్మతలన్నీ వస్తాయి  భోజనానికి అరగంట ముందు మంచినీళ్లు తాగాలి  భోజనం చేసిన తర్వాత  అరగంట వరకు నీరు త్రాగకూడదు  మనం తినే పండ్లు  కూరగాయలు క్యారెట్ బీట్రూట్ బొప్పాయి ఆరంజ్ మొదలైనవి తినాలి  భోజనం చేయడానికి కూడా కొన్ని పద్ధతులు ఉన్నాయని సూచించారు పెద్దలు.


కామెంట్‌లు