కదంబం;- డా.నీలం స్వాతి,చిన్న చెరుకూరు గ్రామం,నెల్లూరు.6302811961.
 తల్లి పిల్లలకు చెప్పవలసిన విషయాలలో ముఖ్యమైనది మన భాషలో ఉన్న అర్థాలు  సరైన అర్థం లో సరైన  పద విభజన ద్వారా చెప్పగలిగితే ఆ బిడ్డ  భవిష్యత్తులో మంచి విద్యార్థిగా తయారవుతాడు  చిన్నపిల్లల్లో పెద్దవాళ్లు భగవంతుని దగ్గర కూర్చుని పూజ చేస్తూ ఉన్నప్పుడు వాడు కూడా పూజ చేయడానికి సిద్ధమవుతారు  మనం ఏది చేస్తే పిల్లలు దానిని అనుసరిస్తూ ఉండడం సహజం  అయితే దీనిని నియమాలయానికి ఎలా చేయాలి అన్నది కూడా  వాళ్లకు తెలియాలి  మనకున్న హిందూ ముస్లిం క్రైస్తవ మతాల పద్ధతులలో  భగవంతుని స్తుతించడానికి కానీ పూజ చేయడానికి కానీ వారి పద్ధతులు వారికి ఉంటాయి  క్రైస్తవులు  ముస్లింలు వారి పద్ధతిలో చేస్తూ ఉంటారు హిందువులు మాత్రం  కొంతమంది గుడికి పూజకు వెళుతూ ఉంటారు  కొంతమంది ఇంటిలోనే చేసుకుంటూ ఉంటారు.
ఏ ఆలయమైనా జ్ఞానిగా జన్మించిన వాడిని విజ్ఞానిగా చేయడానికి పనికొస్తాయి  విద్యాలయాలు కావచ్చు వైద్యాలయాలు కావచ్చు  దేవాలయాలు కావచ్చు గ్రంథాలయాలు కావచ్చు వీటిలో ఏ ప్రాంతానికి వెళ్లినా  తన మనసు వికసించే విషయాలే అక్కడ మనకు కనిపిస్తాయి తప్ప  వేరే విషయాలకు స్థానం ఉండదు  విద్యాలయంలోకి వెళితే అక్షరం ఎలా దిద్దాలో ఎలా నేర్చుకోవాలో దానిని ఎలా జ్ఞాపకం ఉంచుకోవాలో  గురువు ద్వారా నేర్చుకోవలసిన  పద్ధతి అక్కడ ఉంటుంది  కొంచెం పెరిగి విద్యలో  కొన్ని పద్ధతులను అధ్యయనం చేసిన తరువాత  దానిలో ఉన్న మూల సూత్రాలు ఏమిటో కూడా గురువు ద్వారా తెలుసుకోవచ్చు  ప్రత్యేకించి తెలుసుకోవలసినది స్పష్టత, క్లుప్తత. స్పష్టత అంటే అక్షరాలను స్పష్టంగా పలకడం అన్న అర్థంలో కాకుండా  నీవు ఏ విషయాన్ని గురించి ఇతరులకు చెప్పదలుచుకున్నావో దాని గురించిన  మొత్తం పాఠం  నీ దగ్గర సిద్ధంగా ఉండాలి  నీవు చెప్పదలుచుకున్న విషయంలో  దేని తర్వాత ఏది చెప్పాలో  పద్ధతి ప్రకారం  ఎదుటివారికి అర్థమయ్యేట్లుగా చెప్పడం  స్పష్టత  క్లుప్తత అంటే  చాట భారతము లాగా అమ్మలక్కలు కూర్చున్నప్పుడు ఏవేవో మాట్లాడుతూ ఉన్న విషయాలు కాకుండా  నీవు ఏ విషయాన్ని చెప్పదలుచుకున్నావో దానిని స్పష్టంగా చెప్పాలి  దానికి ఎలాంటి అతిశయోక్తులు కానీ  కథలాగా చెప్పడం కానీ  సాగదీయడం కానీ లేకుండా చెప్పడం క్లుప్తత కిందకు వస్తుంది

కామెంట్‌లు