మా అందరితో పాటు వ్యవసాయ కార్యక్రమ సంచాలకులు కేవీ సుబ్బారావు కమ్మటి ఘంటసాల వారి పాటలు పాడి వినిపించే మా లైబ్రేరియన్ బిఎస్ నారాయణమూర్తి బాపు గారి తమ్ముడు మా అధికారి శంకర్ నారాయణ గారు సంగీత ప్రపంచంలో వయోలీన్ కు విలువ తెచ్చిన బాలమురళి గారి అనుయాయి అందరి మన్ననలను పొందిన దత్తాడ పాండురంగరాజు గారు మా ఆస్థాన హోమియో వైద్యుడు తంబురా కళాకారుడు ఏవీఎస్ కుటుంబయ్య గారు కూడా పాత్రోచితంగా నటించిన నాటకం శ్రీమతి సుభద్రమ్మ గారి నిర్వహణలో తయారయింది ఆ రోజుల్లో రేడియోలో ఉద్యోగి కాకపోయినా కడియాల జగన్నాథ శర్మ చాలా కార్యక్రమాలను రూపొందించాడు.యువభారతి నేటి యువ వాణి కార్యక్రమంలో నుంచి సాహిత్యం వరకు అన్నీ చూసేవాడు తర్వాత సమాజ శాస్త్రంలో పరిణతి చెంది ఉద్యోగించి ఈమధ్య అందరి ప్రశంసలకు పాత్రుడయ్యాడు మైత్రి బంధంతో ఆ గ్రంథాన్ని ప్రేమతో నాకు అంకితం ఇచ్చాడు అందరికీ ఆప్తుడు అందరి సహకారంతో విజయవాడలో రంగస్థలం ఫై అనేక నాటకాలు సంగీత సభలు, సంగీత కార్యక్రమాలు నిర్వహించాడు. మేము ఇద్దరం కాలేజీలో మా సంస్థ ద్వారా నాటకాలు సంగీత కచేరీలు ఏర్పాటు చేసేవాళ్లం. విజయవాడలో చల్లా కామేశ్వరి గారికి కళాకారులు అంటే ఎంతో ఇష్టం ప్రత్యేకించి రేడియో వాళ్లంటే మరీ ప్రాణం భోజనం చేయని విద్వాంసులు ఆమె చేత సన్మానం పొందని కళాకారుడు లేరంటే అతిశయోక్తి కాదు. ఆమెను పతీసమేతంగా నరసింహమూర్తి సన్మానించడానికి ఏర్పాటు చేశాడు శర్మ కళాకారుడు తమిళవాసులకు పాల్కాట్ మణి లాగా ఆంధ్రులకు మృదంగ కళాకారుడు దండమూడి రామ్మోహన్రావు మహాదేవరాధాకృష్ణమ్ రాజు వయోలిన్ వాద్యానికే పేరు తెచ్చిన అన్నవరపు రామస్వామి యుగళగాత్రంలో తమకు తామే సిద్దులని పించుకున్న బ్రహ్మరాజు సూర్యారావు ఎం వి రమణ మూర్తి నిలబెట్టి వీణ వాయించిన వాయించగలిగిన ఏకైక విద్వాంసులు కంభంపాటి అక్కాజీ రావు కార్యక్రమాన్ని నిర్వహించిన కళ్యాణ జగన్నాథ శర్మ కె.వి.రెడ్డి మా అధికారి శ్రీనివాసన్ వారి బావమరిది పండరి నృత్య కళాకారిణి నర్రాగోపాలకృష్ణ గారి అమ్మాయి వాసిరెడ్డి కనకదుర్గ మా నిలయ కళా కారిణి శ్రీరంగం గోపాల రత్నం సన్మానితులు చల్లా కామేశ్వరి నర్సింహమూర్తి గారులు పాల్గొన్నారు.
ఆకాశవాణి విజయవాడ కేంద్రం;- ఏ.బి ఆనంద్,ఆకాశవాణి,విజయవాడ కేంద్రం,9492811322.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి