ఆకాశవాణి విజయవాడ కేంద్రం;- ఏ బి ఆనంద్,ఆకాశవాణి,విజయవాడ కేంద్రం,9492811322.
 ఇద్దరు ఆడపిల్లలు ఎప్పుడూ వెన్నుపూసను మర్దనా చేస్తూనే ఉంటారు  అమ్మ గదిలో నేను శ్రీ గోపాలు రామకృష్ణ ఉన్నాం  అమ్మా మీరు బాపట్లలో ఉన్నప్పుడు సన్నగా ఉండేవారని మా నాన్నగారు చెప్పారు ఇప్పుడు అన్న పానాధులు మానిన తర్వాత శారీరకంగా పెరిగారు భోజనంలో ఉన్న పదార్థాలు తింటే కదా శరీరం పెరగడం మీరు భోజనమే చేయరు కదా అని కుతూహలంతో అడిగిన దానికి సమాధానంగా ఏమో నాకు తెలియదు రా (అందరినీ ఒసేయ్ ఏరా అని పిలుస్తుంది అమ్మ) కానీ నేను స్నానం చేస్తున్నప్పుడు ముత్తయిదులు ఎన్ని బిందెల నీళ్లు ఎక్కువ పోస్తే అంత భోజనం చేసిన తృప్తి కలుగుతుంది అని చెప్పింది అమ్మ  తిరిగి విజయవాడ వచ్చిన తర్వాత ఆధ్యాత్మిక గురువు డాక్టర్ కాకర్లపూడి వెంకటరాజు గారికి విషయం చెప్తే  పంచభూతాలతో ఏర్పడే ఈ శరీరం ఆ పంచభూతాల ద్వారానే ఆహారం స్వీకరిస్తుంది.
పాము గాలితో ఎలా జీవిస్తుందో ఆమెకు తెలియకుండానే జలంలో ఉన్న ప్రాణవాయువును స్వీకరించే గుణం ఆమెకు వచ్చింది అని చెప్పి నా సందేహాన్ని తీర్చారు  అక్కడ వంటశాలలో ఒక తమిళ బ్రాహ్మణుడు ఉన్నాడు అమ్మ మీద అతనికి నమ్మకం లేదు  ఒకనాడు శిష్యులతో అమ్మ వంటశాలలో ప్రవేశించి నాయర్ ని పిలిచి  పెద్ద పాగులో సలసలా కాగుతున్న సాంబారులో చేతిని దించి ఒక ఉల్లిపాయని తీసి ఏమిట్రా ఈ ఉల్లిపాయ ఉడకలేదు అన్నది  అంత కాగిన సాంబారులో ఆమె చేయి పెట్టినా కాలకపోవడమే వింతగా భావించిన తను దానిలో  పచ్చి ఉల్లి ఎలా ఉంది అని   అతని శంక వెంటనే అతను ఆమె పాదాలపై పడి  క్షమాపణ కోరి ఆనాటి నుంచి ఆమెకు ప్రియ భక్తుడయ్యాడు.1972లో నేను శ్రీ గోపాల్ తిరువణ్ణామలై వెళ్లి శ్రీ భగవాన్ రూపకం చేసాం  ఆ సమయంలో చలం గారు మంచం మీద ఉన్నారు.వారు  మాట్లాడలేని స్థితిలో ఉన్నారు. ఆ తర్వాత మూడు నెలలకు మళ్ళీ తిరువణ్ణామలై వెళ్ళాం నేను శ్రీ గోపాల్  వెళుతూ వెళుతూ  జిల్లెళ్ల మూడి వెళ్లి అమ్మను చూద్దామనుకున్నాం ఆమె ఆరోగ్యం బాగాలేదు గదిలో చుట్టూ నల్లటి దుప్పట్లు కట్టి ఉంచారు మమ్మల్ని మాత్రం లోపలికి వెళ్ళనిచ్చాడు  మమ్మల్ని చూడగానే ఎంతో ఆనందంతో ఆమె అన్న మొదటి మాట వాడు లేచాడు చక్రాల కుర్చీ మీద రోడ్డంట తిరుగుతున్నాడు అని నవ్వుతూ వాడు అంటే  తిరువణ్ణామలై ఉన్న చలం గారు అదేంటమ్మా ఆయన మంచం మీద ఉన్నాడుగా అంటే లేదురా ఇప్పుడే రోడ్ ఎక్కాడు అంది నవ్వుతూ
కామెంట్‌లు