యాత్రికులా పడి కావలి గుండ గోవింద నామ సంకీర్తనలు చేస్తూ వెళ్లడాన్ని చూస్తే ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది వడి కావలి దాటగానే ఒక ప్రదక్షణ ఉంది దానికి సంపద ప్రదర్శనమని పేరు ఈ ప్రదక్షిణము నడిమి పడి కావలి అను ద్వారము గుండా దాటగా విమాన ప్రదక్షణం ఉంటుంది ఇది కాక వైకుంఠ ప్రదక్షణం కూడా మనం చూడవచ్చు ఇది ముక్కోటి ఏకాదశి అంటే ధనుర్మాసంలో శుక్లపక్ష ఏకాదశి ఉదయానే తెరిచి ద్వాదశి సాయంకాలం మూస్తారు ఇంకా వెయ్యికాళ్ల మండపం గురించి క్రీస్తు శకం 18-1-1464 మల్లయ్య దేవ మహారాజు తిరుమల ఆలయం ముందు భాగంలో దీనిని నిర్మించారు గుడి ముందు సన్నిధి వీధి ఇరుకుగా ఉందని ఈ వేయి కాళ్ళ మండపంలోని కొన్ని వరుసల స్తంభాలను ఆ కాలంలోనే తొలగించారు.అయినా దీనిని అంగళ్లుగా గదులుగా పోలీస్ స్టేషన్గా మేడ మీద ఉద్యోగుల నివాస గృహాలు గానూ, క్యాంటీన్ గానూ ఎన్ని రకాలుగా వాడవచ్చునో అన్ని రకాలుగా వాడి ఇప్పుడు అసలే లేకుండా చేశారు మల్లయ్య దేవ మహారాజు కాలంలో ఇక్కడకు దేవుడు వచ్చే వాడేమో శ్రీవారి దేవస్థానం మనకు ఎదురుగా ఈ మండపం ఉంది మండపం లోపలికి వెళ్లడానికి పశ్చిమ భాగం నుంచి మెట్లు ఉన్నాయి మంటపములకు పశ్చిమ భాగము ఆంగళ్ళ వల్ల మూయబడినందున ఉత్తర పాశ్య భాగము ద్వారా చాలా ఉపయోగింపబడుచున్నది. వేయి స్తంభములు ఉన్నవని చెప్పుటయే కానీ ఇప్పుడు అంత సంఖ్య లేదు ఈ మండపాల్లో కొంత భాగం శిథిల మై పడిపోవడం వల్ల స్తంభాల సంఖ్య తక్కువ.మంటపము కట్టిన కాలము సరిగా తెలియదు కానీ చాలా పురాతనమని చెప్పడానికి సందేహం లేదు ఈ మంటపం చాలా భాగం యాత్రికుల కొరకు అరలుగా కట్టబడి ఉన్నది కొంతకాలం ధర్మశాల గా ఉంది మండపం యొక్క కొంత భాగం తక్కువగాను కంబాలన్నీ మోటుగానూ ఎంతో సమీపంగా ఉండటం వల్ల అంత బాగా తెలియదు శ్రీవారిని వేంచేయడానికి ఒక భక్తుడు వెళ్లి కట్టించినట్లు చెప్పడమే కానీ మిగిలిన వివరాలు మనకు తెలియదు శ్రీహత్తిరాంజీ మఠం ఆగ్నేయంలో ఎత్తైన స్థలంలో ఈ మఠం ఉంది ఈ మఠానికి మూలపురుషుడు శ్రీహత్తి రాంజీ వారు వీరు ఉత్తర హిందుస్థాన్ లో ఢిల్లీకి 24 మైళ్ళ దూరంలో ఉన్నటువంటి క్రెడల్ క్రేలా అను పురం నుంచి వచ్చిన వారు వీరు.
మన తిరుపతి వెంకన్న- ఏ.బి ఆనంద్,ఆకాశవాణి,విజయవాడ కేంద్రం,9492811322
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి