మా ఓటుమేముఅమ్ముకోము;- అంకాల సోమయ్య-దేవరుప్పుల-జనగామ-9640748497
 మాఓటుమేము అమ్ముకుంటే
మీకేం బాధ
మమ్మల్ని ప్రశ్నించే  హక్కు
మీకెక్కడిది
మా ఓటు
మా ఇష్టం
అమ్ముకుంటాం
మేమేమైనా చేసుకుంటాం
మాకు ఆమాత్రం  స్వేచ్ఛలేదా!?
అంటే ఉంది 
ఓటంటే నువ్వేమనుకున్నవ్
నీకు అభ్యర్థి ఇచ్చే 1000,2000 లోఅనుకున్నవా!?
 ఓట్లంటే యావద్దేశపు అభివృద్ధి 
ఓట్లతో మనందరి ఉమ్మడి నాయకుడి ఎంపిక ప్రక్రియ
ఓట్ల తో ప్రజల ఈతిబాధలు తొలగిపోయి సుఖసంతోషాలు
అందించే
నాయకుడు కోసం చేసే
మహా క్రతువు
ఈ క్రతువు లో యాగఫలం
దక్కవలసినది
దేశ పౌరులకే గదా?!
అలా జరగడం లేదే ?!
దేశ మంటే  మట్టి కాదోయ్
దేశ మంటే మనుషులోయ్

కామెంట్‌లు