‌‌స్పాట్ కిల్లింగ్ రోబో;- అంకాల సోమయ్య-దేవరుప్పుల-జనగామ-9640748497
 ప్రేమతత్వం
మానవత్వం
మమతానురాగం
మరిచిన మానవుడి
అధమసృష్టే
స్పాట్ కిల్లింగ్ రోబో వికృతావిష్కరణం
ఇదిమానవమేధతిరోగమనానికి
పరాకాష్ట
సకల మానవాళిని
వల్లకాటికి పంపే
కుట్ర కోణం 
అమ్మకున్న అనునయింపు
రోబోట్ బొమ్మకుంటదా?
చార్జింగ్ బొమ్మ అది 
కరుణలేని కృత్రిమ మేధో వికాస వికృతిఅది?
ఆత్మీయత మృగ్యమై
ఆధిక్యత దే అగ్రపీఠమై
జగజ్జేతవ్వాలని ఉవ్విళ్లూరే
దురహంకార దేశాల అహంభావమది 
పొంచివున్న బయోవార్ కు స్వాగతం 
పలికుతున్న పరమరక్కసి మిడతలదండది
సకలజగములు
సకలజనులు
ఆత్మీయులయ్యేదెపుడో
మంచి మానవత వెల్లివిరిసేదెపుడో?
ఈ మారణాయుధ ప్రేమలు
కనుమరుగైనప్పుడే !?
సర్వే జనా సుఖినోభవంతు
సర్వే సుజనా సుఖినోభవంతు

కామెంట్‌లు