జర యోచించూ!!;- -గద్వాల సోమన్న,9966414580
వజ్రం మెరియాలంటే
సాన పెట్టాల్సిందే!
బ్రతుకున ఎదగాలంటే
కడు కష్టపడాల్సిందే!

చీకటి పోవాలంటే
దీపం వెలగాల్సిందే!
తెలివి పెరగాలంటే
పొత్తం చదవాల్సిందే!

నెమ్మది దొరకాలంటే
ధ్యానం చేయాల్సిందే!
భవిత బాగుండాలంటే
శిక్షణ ఉండాల్సిందే

వైరం పోవాలంటే
క్షమను పంచాల్సిందే!
బంధం నిలవాలంటే
నమ్మకం కుదరాల్సిందే!

కామెంట్‌లు