ఎంత ఉన్నతమో ఉపకారం;- -గద్వాల సోమన్న,9966414580
ఎంత మధురమో వేణు నాదం
ఎంత పవిత్రమో శిశువు పాదం
జీవుతంలో అనునిత్యమూ
ఎంత చెరుపుపో గాంచు వివాదం

ఎంత శోభస్కరమో ధ్యానం
ఎంత అమూల్యమైనదో జ్ఞానం
ఎంత సంపాదించినా ఇహమున
విలువేమున్నది పోయిన ప్రాణం

ఎంత ఉన్నతమో ఉపకారం
ఎంత శ్రేష్టమైనదో  సహకారం
ఎంత నీచగుణమో అపకారం
 సాటిలేని మేటి స్నేహంలో
ఎంత నీచగుణమో అపకారం

ఎంత అందమో తెలుగు నుడికారం
ఎంత బలిష్టమైన ప్రకారం
"తేనెలాంటి తెలుగు " పరిరక్షణకు 
ఎంత అవసరమో చుట్ట శ్రీకారం


కామెంట్‌లు