శ్రీ విష్ణు సహస్రనామాలు (బాల పంచపది )-ఎం. వి. ఉమాదేవి
601)శ్రీవత్స వక్షా -

వక్షమందు శ్రీవత్సమున్నవాడు 
కోరినవి ప్రసాదించగలవాడు 
కామధేనువుగానుండినవాడు 
కోరినసంపదలనొసగువాడు 
శ్రీవిష్ణు సహస్రనామాలు ఉమా!
602)శ్రీవాసః -

వక్షస్థలమున లక్ష్మియున్నవాడు 
పాలకడలియందున్నట్టి వాడు 
వైకుంఠమున లక్ష్మితోనున్న వాడు 
శ్రీనివాసుడను నామధేయుడు 
శ్రీ విష్ణు సహస్రనామాలు ఉమా!
603)శ్రీపతిః -

లక్ష్మిదేవికి భర్తయైనవాడు 
సిరులకు పతిగానుండినవాడు
 సంపదలకు మూలమైనట్టి వాడు 
శుభప్రదుడయి యున్నవాడు 
శ్రీ విష్ణు సహస్రనామాలు ఉమా!
604)శ్రీమతాంవరః -

శ్రీమంతులలో శ్రేష్ఠమైనట్టివాడు 
సంపదకు వరమొసగువాడు 
ధనమును చేకూర్చునట్టివాడు 
భక్తులకు సాయమిచ్చువాడు 
శ్రీ విష్ణు సహస్రనామాలు ఉమా!
605)శ్రీదః -

భక్తులకు సిరినిచ్చుచున్నవాడు 
సంపదలకు మూలమైనవాడు 
శ్రీకరము అయినట్టివాడు 
ధనమును దయచేయగలవాడు 
శ్రీవిష్ణు సహస్రనామాలు ఉమా!

(సశేషం )

కామెంట్‌లు