ఎదురుచూస్తున్నా!;- గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
ఋతువు
మార్పుకోసం
ఎదురుచూస్తున్నా!

శిశిరమాసం
అంతంకోసం
ఎదురుచూస్తున్నా!

చైత్రమాసం
ఆరంభంకోసం
ఎదురుచూస్తున్నా!

వసంతమాసం
ఆగమనానికోసం
ఎదురుచూస్తున్నా!

ఉగాది
షడ్రుచులకోసం
ఎదురుచూస్తున్నా!

మల్లెల
పరిమాళాలకోసం
ఎదురుచూస్తున్నా!

కోకిల
కుహూకుహూరాగాలకోసం
ఎదురుచూస్తున్నా!

మామిడి
పండ్లకోసం
ఎదురుచూస్తున్నా!

చెట్లు
పచ్చబడాలని
ఎదురుచూస్తున్నా!

యుగాది
పచ్చడితినాలని
ఎదురుచూస్తున్నా!

గుడిలో
పూజలుచేయటంకోసం
ఎదురుచూస్తున్నా!

గోపాలస్వామిరుక్మిణీల
కళ్యాణంచెయ్యటంకోసం
ఎదురుచూస్తున్నా!

దేవుడిని
ఊరిలో ఊరేగించటంకోసం
ఎదురుచూస్తున్నా!

పంచాంగ
శ్రవణంకోసం
ఎదురుచూస్తున్నా!

తెలుగుసంవత్సరాది
కవితనువ్రాయటానికోసం
ఎదురుచూస్తున్నా!

కవులను
కలుసుకోవటంకోసం
ఎదురుచూస్తున్నా!

కవితాగానంతో
ప్రేక్షకులనుపులకరించాలని
ఎదురుచూస్తున్నా!

కవుల
సమ్మేళనాలకోసం
ఎదురుచూస్తున్నా!

కామెంట్‌లు