అదుగో!
కాలుని మహిషపు మెడగంటలు
గట్టిగా మోగుతున్నాయి
మందు మాకులు చాలు
పూజలు, వ్రతాలు, మంత్రాలు చాలు
కోటి ప్రయత్నాలు చేసినా
కాలము చెల్లగానే
కాటికి చేరక తప్పదు
అయినా....
పుట్టిన ప్రతిప్రాణీ
గిట్టటం తెలిసికూడా
చింతించడం ఎంత వెర్రితనమో కదా!
ఎంతటి భాగ్యవంతుడైనా,గుణవంతుడైనా,
సౌందర్యవంతుడైనా,యుక్తిపరుడైనా,
కులీనుడైనా, బడుగైనా
కాలుని పాశము విడిచిపెడుతుందా?
అందుకే మిత్రమా!
సర్వభూతాలపట్ల దయతో, అనురాగంతో
ధర్మమార్గంలో నడుద్దాం
దైవంపై భారమేద్దాం
నిర్మలమైన మనసుతో
దీనులను, అభాగ్యులను సేవిద్దాం
అందరికీ చావు అనివార్యం మిత్రమా!!
**************************************
x
అనివార్యం;- డా.గౌరవరాజు సతీష్ కుమార్.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి