తిరుపతి శ్రీ శ్రీ కళా వేదిక ఆధ్వర్యంలో జర్నలిస్టుల ఆత్మీయ సన్మాన కార్యక్రమంలో ధనాశి ఉషారాణి కి ప్రత్యేక అభినందనలు

 అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన సంస్థ శ్రీ శ్రీ కళావేదిక తిరుపతి జిల్లా శాఖ మరియు అంతర్జాతీయ చైర్మైన్ శ్రీ కత్తి మండ ప్రతాప్ గారి సారథ్యoలో  రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తిరుపతి జిల్లా అధ్యక్షులు శ్రీ అరవ జయపాల్ మరియు రాష్ట్ర మహిళా ప్రధాన కార్యదర్శి తిరుపతి జిల్లా ప్రధాన కార్యదర్శి ధనాశి ఉషారాణి సంయుక్త నిర్వహణలో శ్రీ రామ నవమి శుభాకాంక్షలు తో అక్షరానికి పట్టాభిషేకం చేస్తూ  తిరుపతిలోని శ్రీదేవి కాంప్లెక్స్  ప్రెస్ క్లబ్ లో జర్నలిజములో సేవలు అందించిన సీనియర్ జర్నలిస్టులకు ఆత్మీయ సత్కార కార్యక్రమంను మే 17 తేదీన నిర్వహించారు తిరుపతి జిల్లా అధ్యక్షులు శ్రీ అరవ జయపాల్ మరియు ప్రధాన కార్యదర్శి ధనాశి ఉషారాణి చేతులు మీదుగా  కార్యక్రమం నిర్వహించారు.28 ప్రపంచ రికార్డులు సాధించిన ఏకైక సంస్థ శ్రీ శ్రీ వేదిక  నెల నెల సాహితీ క్రతువు నిరoతర సాంస్కృతిక ప్రభంజనంలో భాగంగా నిర్వహిoచిన వినూత్న కార్యక్రమంకు  శ్రీ భూమన  గారు శ్వేత డైరెక్టర్ గారు  హేమమాలిని విద్యశాఖ అధికారి ముఖ్య అతిథిగా విచ్చేశారు విశిష్ట సేవలు అందించిన 30 మందికి దుస్సాలవ మెమెంటోతో సత్కరించారు.అతి తక్కువ సమయంలో జానపదములో మూడు  పెద్ద కార్యక్రమాలను నిర్వహించిన సీనియర్ జర్నలిస్టు  శ్రీ అరవ జయపాల్ గారిని ప్రముఖ రచయిత్రి తెలుగు ఉపన్యాసకురాలు ధనాశి ఉషారాణి ని  అతిధులు ప్రత్యేకంగా గౌరవించారు జాతీయ కమిటీ  సభ్యులు కొల్లి రమావతి గారు ఈశ్వరి భూషణo గారు చిట్టె లలిత గారు పార్థసారథి గారు హరి సర్వోత్తమ నాయుడు గారు అభినందనలు తెలియజేసారు. ఆంతర్జాతీయ చైర్మెన్ శ్రీ కత్తి మండ ప్రతాప్ గారు తిరుపతి నూతన కమిటీ నిర్వహిస్తున్న సరి కొత్త వినూత్న సాహిత్య  కార్యక్రమం అని అభినందనలు తెలియజేసారు.కార్యక్రమంకు ఆర్థిక సహాయ సహాకారాలు అందించి సేవ భావమును చూపించిన రచయిత్రి ధనాశి ఉషారాణి   ని  అధ్యక్షులు శ్రీ అరవ జయపాల్ గారు ప్రశంసలు కురిపించారు. కార్యక్రమంలో తిరుపతి కార్యవర్గ సభ్యులు రజిని రాళ్లపల్లి మహేశ్వరి మరియు రెడ్డి ప్రసాద్ సుబ్రహ్మణ్యం రుద్ర గారు కార్యక్రమంలో పాల్గొన్నారు.జర్నలిస్టుల సేవలకు ప్రతీకగా తిరుపతిలో నిర్వహించిన కార్యక్రమం విశేషంగా  ఆకట్టుకుoది. అన్ని మీడియాలకు సంబంధించిన ప్రతినిధులు  పాల్గొన్నారు
కామెంట్‌లు
Popular posts
నిశ్శబ్ద కోరిక : - D.రసన్య,10వ తరగతి, తెలంగాణ మోడల్ స్కూల్, ఘన్పూర్ (స్టేషన్), జనగామ (జి)
చిత్రం
అణిమ - మహిమ -------------------------------- అష్ట సిద్ధులు అనే మాట ఆనోటా ఈనోటా వింటూ ఉంటాం. ఇంతకూ ఆ అష్ట సిద్ధులు ఏంటో తెలుసా? అణిమ, మహిమ, లఘిమ, గరిమ, ప్రాప్తి, ప్రాకామ్యం, ఈశత్వం, వశిత్వం - ఈ ఎనిమిదింఃఇనీ అష్టసిద్ధులు అంటారు. ఈ ఎనిమిది సిద్ధులు సామాన్యమైనవి కావు. వేటి ప్రానాన్యం వాటివే. వాటిలో మొదటిదైన అణిమ అంటే శరీరాన్ని అతి చిన్నదిగా చేసుకోవడం. మహిమ అంటేనేమో శరీరాన్ని పెద్దదిగా చేసుకోవడం. ఈ రెండింటినీ సాధించిన వాడు ఆంజనేయుడు. సీతాన్వేషణ సమయంలో ఆంజనేయుడు ఈ రెండు సిద్ఝులనూ ఆచరించి చూపాడు. లంకలో ప్రవేశించినప్పుడు, సూర్యాస్తమయం తర్వాత పిల్లి అంత చిన్నవాడిలా మారిపోయి ఆశ్చర్యకరమైన రూపాన్ని పొందాడు. వృషదంశకమంటే పిల్లి. అలాగే, ఆకాశమంత ఎత్తుకు ఎదిగి సముద్రాన్ని దాటేటప్పుడు మహిమ సిద్ధిని ప్రదర్శించాడు. ఆంజనేయుడి బలపరాక్రమాలను తెలుసుకోవాలనుకున్న దేవతలు దక్షప్రజాపతి కుమార్తె అయిన క్రోధవశకు జన్మించిన నాగమాత సురసాదేవిని కోరారు. అంతట సురసాదేవి రాక్షస దేహం ధరించి "దేవతలు నిన్ను ఆహారంగా సమర్పించారు. నా నోటిలోకి ప్రవేశించు" అని అడుగుతుంది. అప్పుడు 80 యోజనాల భారీకాయుడైన హనుమ కోసం 90 యోజనాల నోరు తెరిచిన ఆ సురసాదేవి నోట్లోకి ప్రవేశించి, ఆమె నోరు మూసే లోపల, బొటన వేలడంతవాడై బయటకు వచ్చేశాడు. అదీ హనుమంతుడి శక్తి!! - యామిజాల జగదీశ్
చిత్రం
తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు--ఎం బిందుమాధవి
చిత్రం
మహాభారతంలో వింత పేర్లు.డా.బెల్లంకొండనాగేశ్వరరావు. (నేడు సుబ్బారావు.శంకరరావు పేరు పలువురికి ఎలాఉన్నాయో నాటి కాలంలో కూడా ఒకే పేరు పలువురికి ఉండేది.పురాణలపట్ల ఆసక్తి, అవగాహన కోరుకునేవారికొరకు ఈవ్యాసం.) మహాభారతంలో రమారమి 1655 ప్రాత్రలు మనకు కనిపిస్తాయి. 'అజుడు'దశలధమహారాజు తండ్రి.మరో'అజుడు'పాండవులతరపున యుధ్ధంచేసినరాజు అతిరథుడు.(భీష్మపర్వం)అలాగే నలుగురు 'అనువిందులు'1.దుర్యోధనుని తమ్ముడు (ఆదిపర్వం) 2.సహాదేవుని దక్షణదిగ్విజయ యాత్రలో ఓడిన రాజు(సభాపర్వం) 3.కేకేయరాజు (భీష్మపర్వం)4.కౌరవల తరపున పోరాడిన అవంతీశ్వరుడు. (ఉద్యోగపర్వం)ముగ్గురు 'అలంబసులు' 1.జటాసురునికుమారుడు. (ద్రోణపర్వం)2.బకాసురునిసోదరుడు.(ద్రోణపర్వం) 3.ఒకరాజుయుద్ధంలో 14.రోజు సాత్యకిచేతిలోమరణించారు.(ద్రోణపర్వం)ఇద్దరు 'అశ్మీకుడు'లు 1అభిమన్యునిచేతిలో మరణించినకౌరవుడు(ద్రోణపర్వం) 2.ఇక్షాకు వంశరాజు,కల్మషపాదుని కుమారుడు.(ఆదిపర్వం)ఇద్దరు 'ఉగ్రశ్రవశుడు' 1.దుర్యోధనుని తమ్ముడు(ఆదిపర్వం) 2.వ్యాసమహర్షి శిష్యుడు. (ఆదిపర్వం)ఇద్దరు 'ఉగ్రసేనుడు'1.జనమజేయునితమ్ముడు(ఆది) 2.దుర్యోధనుని తమ్ముడు.(ఆది)ఇద్దరు 'ఉగ్రాయుధుడు' 1.పాంచాలకుమారుడు (కర్ణ) 2.దుర్యోధనునితమ్ముడు. (ఆది)ఇద్దరు 'ఉత్తరలు'1దక్షునికుమార్తే (ఆది) 2.వరాటమహారాజు కుమార్తె (విరాటపర్వం)ఇద్దరు 'బుచీకకులు'1.ఔర్యునికుమారుడు. (ఆది) 2.దేవాతిథి కుమారుడు.(ఆది)ఇద్దరు 'కపిల'1.కస్యపునిభార్య. (ఆది) 2.గోవు.(ఆది)ఇద్దరు 'కర్ణులు'1.కుంతికుమారుడు. (ఆది) 2.దుర్యోధనుని తమ్ముడు.(ఆది)ముగ్గురు 'గాంధారీలు'1.కౌరవులతల్లి.(ఆది) 2.అజమీఢుని కుమార్తె(ఆది) 3.కుమారస్వామి కొలువులో దేవాంగన (అరణ్య)ముగ్గురు'గోపతి'లు 1.తపుడు అను వహ్ని పుత్రుడు. (అరణ్య)2.మయసభకు వెళ్లిన ఋషి.(సభా) 3.శిబి మనవడు.(శాంతి )ముగ్గురు 'ఘృతాచి'లు.1.అప్సరస.(ఆది)2.ఛ్యవనుని కోడలు.(ఆది)3.కశ్యపునిభార్య. (ఆది)ముగ్గురు'చంద్రసేనుడు'లు 1.శల్యుని చక్రరథికుడు.(శల్య)2.ద్రౌపతి స్వయంవరంకి వచ్చినరాజు. (ఆది)3.భీముని దిగ్విజయ యాత్రలో ఓడినరాజు. (సభా)ముగ్గురు 'చిత్రుడు'లు 1.పాంచాలరాజు.2. చేధిరాజు.(కర్ణ)ఇద్దరు 'చిత్రరథులు'1.ద్రుపద సంజాతుడు అయిన వీరకేతుని పుత్రుడు. (ద్రోణ)2.రేణుకాదేవి కి నీళ్లవద్ద కనిపించిన వాడు.3.అంగరాజు. (అరణ్య)ముగ్గురు'చిత్రవర్మ'లు1.వీరకేతుని పుత్రుడు. (ద్రోణ) 2.దుర్యోధనుడి తమ్ముడు.(ఆది)3.విరూపాక్ష అంశంతో జన్మించినవాడు. (ఆది)నలుగురు'చిత్రసేనులు'1.కర్ణుని చేతిలో మరణించిన పాండవవీరుడు. (కర్ణ)2.ఘోషూయాత్రలో దుర్యోధనుని బంధించినవాడు.(అరణ్య)3.కర్ణ తనయుడు.నకులునిచేతిలో మరణించాడు.(శల్య)4.పాండవ వీరుడుశ్రుతకర్మ చేతిలోమరణించాడు. (కర్ణ)(మిగిలినవి మరో పర్యాయం.)
చిత్రం
తెలుగు సాహిత్యం-శివ కవులు-- బెహరా ఉమామహేశ్వరరావు--సెల్ నెంబర్: 9290061336.
చిత్రం