తమాల వృక్షపు ఛాయలో
అమితమైన హృదయోల్లాసంతో
రెండాకులవంటి నీలాల కన్నులనిండా
కాకుల లోకపు స్ప్రహవదిలి
కలల సౌధపు శిఖరాగ్రాన
శీతోష్ణపు భేదాలరయక
హితోక్తుల నాకర్ణించక
మరణపుటంచులదాకైనా
కణకణమండే ప్రేమజ్వాలలో మరణించుటకైనా
సుముఖముగా ఉన్నదా ప్రేమైక మిథునము!
**************************************
మిథునము; -- డా.గౌరవరాజు సతీష్ కుమార్
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి