అకాల విపరీతం;- కొప్పరపు తాయారు

ఉన్నట్టుండి ఆకాశం 
నవ్వింది, ప్రకృతి పులకించె 
ధరణి మాత వేడెక్కిన 
హృదయంతో ఆనందం 

పంచ లేక చల్లారింది 
కారుణ్యంలేని కలి
కకా వికలు చేస్తుంటే 
ప్రగతికై పడిగాపులు 

పడుతూ ఉంటే ఎండనక 
వాననక నెట్టుకువస్తుంటే 
ఇదే వైపరీత్యం ఆ వడగళ్ళు 
వింతల్లో వింత, మింగ నీటి చుక్క 

లేదు, ఆకాశం వడగళ్ళు
విసిరుతోంది, ఇది వేళాకోళమా 
వెక్కిరింతా, కాని కాలపు వికృతపు 
చేష్టలు, అలసిన హృదయం 

ఆలోచించలేక ధరణితో పాటు 
కార్చే కన్నీరు, కాలం తన ధోరణి లో 
సాగక మానదు, దైవం తన పద్ధతిలో ఆశీస్సులు

అందివ్వక మానదు, నడుమ 
అర్బక జీవులు ఎటు పోలేక కొట్టుమిట్టాడు
 బ్రతుకులు, అర్థంపరమార్థందైవమెరుగు,

వింత పోకడల గల్లంతు వ్యవహారాలే
 అంతు చిక్కవు, లేనిచో కాలం కాని కాలంలో 
ఈ వర్షం ఏమిటి వడగండ్లు 

ఏమిటి తట్టుకోమని సవాలా,
 సరిపెట్టుకోమని సందేశమా, 
బ్రతుకు దుర్భరమవుతున్నా 

ఎన్ని బెదిరింపులుఅదిరింపులు 
వచ్చిన తప్పదు బ్రతుకు జీవుడా !అని నడక!

కామెంట్‌లు