ఉగాది జాతీయ కవి సమ్మేళనం బ్రోచర్ ఆవిష్కరణ
 తిరుపతి జిల్లా చిన్నగొట్టిగల్లు మండలము భాకరాపేటకు చెందిన రచయిత్రి ధనాశి ఉషారాణి  ప్రముఖ స్థానిక  డాక్టర్ వేణుగోపాల్ రెడ్డి జనరల్ సుగర వ్యాధి నిపుణులు చేతులు మరియు  పవన్ సుప్రియ చేతులు మీదుగా ఉగాది బ్రోచర్ ఆవిష్కరణ చేయడం జరిగింది.
అంతర్జాతీయ సాహిత్య సాంస్కృతిక సంస్థ శ్రీ శ్రీ కళా వేదిక  డా .బి .ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆధ్వర్యంలో అంతర్జాతీయ అధ్యక్షుడు   డా కత్తి మండ  ప్రతాప్ నిర్వహణలో జరిగే అమలాపురం లయన్స్ క్లబ్ ఆడిటోరియoలో జరిగే  132 వ జాతీయ శతాధిక కవి సమ్మేళనoకు తిరుపతి జిల్లా శ్రీ శ్రీ కళా వేదిక అధ్యక్షులు అరవ జయపాల్ కి ప్రధాన కార్యదర్శి ధనాశి ఉషారాణి ని   శ్రీ కత్తి మండ ప్రతాప్ గారు కోనసీమ కవితోత్సవంకి ప్రత్యేకంగా  ఆహ్వానించడo జరిగింది.ఉమ్మడి తెలుగు రాష్ట్రాల నుండి 143 మంది కవులు పాల్గొననున్నారు ఉగాది సభ వేదికలో తిరుపతిలో వరుసగా రెండు సార్లు జానపద స్వరగానo కార్యక్రమంను గొప్పగా నిర్వహించినందుకు ప్రత్యేకoగా ఉగాది జాతీయ సమ్మేళనంలో అభినందించనున్నారు. జాతీయ కమిటీ నుండి శ్రీ పార్థసారథి గారు కొల్లిరమావతిగారు ఈశ్వరి భూషణo గారు గుత్తా హరిసర్వోత్తమ నాయుడు గారు అరవ జయపాల్ గారు ధనాసి ఉషారాణిని ప్రత్యేకంగా ఉగాది జాతీయ కవి సమ్మేళనంకు శ్రీ శ్రీ వేదిక జాతీయ చైర్మెన్ శ్రీ కత్తిమండ ప్రతాప్ గారు ఆహ్వానం పంపడము జరిగింది.కోనసీమ జిల్లా శాఖ కన్వీనర్ బి వి సత్యనారాయణ అధ్యక్షులు నల్లా నరసింహ మూర్తి ఉపాధ్యక్షులు మాకే బాలార్జున ప్రత్యేకంగా ఆహ్వానించారు.
కామెంట్‌లు