" *రాము తెలివి"* ;- *డా.వాసరవేణి పరశురాం., బాలసాహిత్య రచయిత, సింగారం, రాజన్న సిరిసిల్ల*

 అనగనగా గుండారం ఊరు. ఆ ఊరిలో  సురేశ్ అనే రైతు ఉన్నాడు. అతనికి రాము అను కొడుకు ఉన్నాడు. అతడు రెండవ తరగతి  చదువుతున్నాడు. రాముకు నాయనమ్మ రేణుక ఉంది. ఒకరోజు పగలు బడినుంచి వచ్చాడు. నాయనమ్మ  కాళ్ళు జారి బావిలో పడింది. అది చూచిన రాము పొడుగు తాడు తెచ్చాడు.తాడుకొన బావిలో విసిరాడు మరొక కొన పైన కట్టాడు. తాడును పట్టుకో నాయనమ్మా అని అరిచాడు. తాడును పట్టుకుంది. ఆ అరుపులకు అందరూ గుమిగూడారు. బావిలోకి దిగి ముసలవ్వను తీసి కాపాడారు. అందరు రాము సమయస్ఫూర్తికి, సాహాసానికీ మెచ్చుకున్నారు.
     -
కామెంట్‌లు