చల్లని నీరు రాతిని కోసినట్లు
వెచ్చని గాలి మంచును కరిగించినట్లు
చల్లని వాతావరణం మేఘాన్ని కురిపించినట్లు.
నిప్పుల కొలిమిలో ఉక్కు ఉడికినట్లు
నా మనసును ఉడికించిన ప్రేమ ఎవరు నీవు!!!?
నా గుండెను కోస్తున్న ప్రేయసి ఎవరు నువ్వు!!?
మల్లెలు పూస్తున్నవి
కనకాంబరాలు సంబరపడుతున్నవీ
మొగలిపూలు రగులుతున్నవీ
గులాబీలు విచ్చుకుంటున్నవీ
ఇలా పూలవనాలన్నీ పరిమళిస్తున్నవి!!!
కళ్ళు అదురుతున్నవి
ఒళ్ళు ఎదురుచూస్తున్నది
గుండె బెదురుతున్నది
ఇలా మనసుకుదురుగా లేదు!!!?
కునుకు రాదు
పెదవి కదలదు
ఉదయం రాదు
హృదయము రాగమయింది!!!
ఇలా మాయ ఏదో కమ్మింది
గాయం ఏదో అయింది!!!
నీ పేరే స్మరిస్తున్న
నీ గురించే ఆలోచిస్తున్నా!!
గాలిలో నిన్ను శ్వాసిస్తున్న
నీరులా నిన్ను తాగుతున్న
అన్నంలా నిన్ను తింటున్న
స్వరం లా నిన్ను పిలుస్తున్న
చూపులా నిన్ను చూస్తున్న
పలుకులా నిన్ను వింటున్న
మొత్తంగా నీవు నేను గా ఉంటున్న!!!!?
ప్రేయసి ఎవరు నువ్వు!!?
హృదయ ద్వారం తెరిచిందెవరు!!!? మూసిందెవరు!!?
డాక్టర్ ప్రతాప్ కౌటిళ్యా 🙏
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి