ఉగాది ఇది మన తెలుగువారి ముఖ్యమైన పండుగ. చైత్రశుద్ధ పాడ్యమిని మన భారతీయులు 'క్రీ.పూ. 490 శతాబ్దానికి చెందిన ప్రముఖ జ్యోతిష్య శాస్త్రవేత్త వరాహ మిహిరాచార్య నక్షత్ర గమనాన్ని అశ్వని నుండి ఆరంభించి, చైత్ర, వైశాఖ మాసములను వసంత ఋతువుగా నిర్ధారించాడు. ఫాల్గుణ మాసం శిశిరం ఋతువు ముగిసిన తరువాత వచ్చే వసంత ఋతువులో ప్రకృతి పులకిస్తుంది. సంవత్సరం ప్రారంభమైన పండుగ గనకనే సంవత్సరాది అని అంటాము.
శ్రీమహావిష్ణువు మత్స్యావతారంలో వేదాలను సోమకుణ్ణి సంహరించి అప్పగించింది ఈ రోజునే, పండుగను వేదాలందినందుకు ఘనంగా జరుపుకున్నారు. ఈ రోజే సృష్టికర్త బ్రహ్మ ఈ జగత్తును సృష్టించాడని జ్యోతిషానికి చెందిన హేమాద్రి గ్రంథంలో తెలిపోరు. భారతంలో ధర్మరాజు రాజ్యాన్ని జయించి పట్టాభిషిక్తుడయినాడంటారు. ప్రముఖ గణిత శాస్త్రవేత్త వరాహ మిహిరుడు ఈ రోజే పంచాంగాన్ని ఆవిష్క రించారట. ఇన్ని కారణాల వల్ల చైత్ర శుద్ధ పాడ్యమిని ఉగాది పండుగగ ఎంతో ఘనంగా జరుపుకుంటున్నారు.
ఈ వసంత ఋతువులో మానవులకు భౌతిక సుఖమే కాకుండా, ఆధ్యాత్మిక సుఖం కూడా లభిస్తుందని భగవత్పాదులు ఆదిశంకరులు తెలిపారు. 'ఉగాది' అంటే 'ఉ' అంటే నక్షత్రం. 'గ' అంటే గమనం. నక్షత్ర గమనానికి 'ఆది' కనుక 'ఉగాదీ'గా పిరుస్తారు. ఉగాది పండుగ రోజున అభ్యంగనం, సూచన వస్త్రధారణం, పంచాంగ శ్రవణం, సంవత్సరాది దేవత ఆరాధన, ఉగాది పచ్చడి సేవనం చేయవలసిన ముఖ్య పనులు.
గుమ్మాలకు మామిడి తోరణాలు, వేప ఆకులు కడతారు. నూతన వస్త్రాలు ధరించి, తమ ఇష్టదైవారాధన చేస్తారు. వసంత ఋతువులో వడగాల్పులూ, అంటు వ్యాధులూ, ప్రబలుతాయని, వీటి నుండి దూరం కావడానికి 'నింబకుసుమ' భక్షణం' తప్పనిసరి చేయడం వల్ల ప్రకృతి నుండి వచ్చే వ్యాధులను నివారించవచ్చునని తెలుస్తోంది. ఉగాది పచ్చడి జీవితానికి ప్రతీక. జీవితం సుఖదుఃఖాల కలయిక. మామిడి పిందెలు, కొత్త బెల్లం, కొత్త చింతపండు, వేప పూత, ఉప్పు, మిరియం ఇది ఉగాది పచ్చడి.
తిథి,వార,నక్షత్ర, యోగ, కరణములు ఈ ఐదు వందల తో కూడిన పంచాంగాన్ని ఉగాది రోజున వివిధ దేవతలతో పాటు పూజించాలని శాస్త్రం ఈ ఐదు అంగములను ఉగాది రోజు తెలుసుకోవడం వల్ల గంగా నదిలో స్నానం చేసిన ఫలితం లభిస్తుందని ధర్మశాస్త్రోక్తి.!
*" కావ్యసుధ "*
*'వాజ్ఞ్మయ భూషణ'*
*'ఆధ్యాత్మిక సాహిత్య సామ్రాట్'*
*9247313488 : హైదరాబాదు*

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి