ఋతువుల వృత్తం లో ఉగాది;- : కె.కవిత-: హైదరాబాద్.
 క్రోధి నామ ఉగాది పర్వదిన శుభాకాంక్షలు 
==============================
ప్రక్రియ: సున్నితం
==============
అమావాస్య చీకట్లను పారద్రోలి 
నూతన ప్రకాశాన్ని వెదజల్లి
నవ వసంతం అడుగిల్లే
చూడచక్కని తెలుగు సున్నితంబు

చైత్రవీణ ఝమ్మని పలికే
కోకిలమ్మ  రాగాలతో  పిలిచే
తరువుల కొత్తందాలు కనిపించే
చూడచక్కని తెలుగు సున్నితంబు

పచ్చడిలో ఆరోగ్య సుగుణాలు 
ఏనాడో కనుగొన్నారు పూర్వీకులు
సంప్రదాయాన్ని పాటిస్తున్న జనులు
చూడచక్కని తెలుగు సున్నితంబు

పంచాంగ శ్రవణ ఆనందం
రాశులు బాలేనిచో ఖేదం
తప్పదుగా చేయాలి ఆమోదం
చూడచక్కని తెలుగు సున్నితంబు

ఋతువులు ఎన్ని మారినా
పేదింటిలో వసంతాలు  వెదజల్లునా
వృత్తం ఏమైనా మారునా?
చూడచక్కని తెలుగు సున్నితంబు
కామెంట్‌లు