ఓ చిలుకా...! ;- కోరాడ నరసింహా రావు..!

 ఓ చిలుకా...! 
  త్రేతా యుగము గతించింది
 నా ద్వాపరయుగమూఅంత
రించింది... 
  ప్రస్తుతం కలియుగము నడుస్తోంది... 
  నీ విం కా  ఆ త్రేతా యుగము లోనే ఉండిపోతే ఎలా...! 
 ఆ రామ, రామ అంటూనే ఉంటే ఎలా..!! 
  రామ, రామ ... కృష్ణ, కృష్ణ అని... 
  భక్తులను రంజింప జేయవా ? 
     కృష్ణా...! 
   నా తర తరాల ఆరాధ్యము
   నీ పూర్వావతారమైన ఆ రామ నామమే... 
  నీదశావ తారా లనూ ఆరా ధించే మానవులకు నేను చెప్పాలా తండ్రి..., ! 
 నీవు వినలేదా... ఆ హరేరామ, హరేకృష్ణ నామ సం కీర్తనలు..! 
   ఎందుకు స్వామీ నన్ను పరీక్షి స్తావు...! 
    ఆ చిలుక పలుకులకు శ్రీ కృ ష్నుని ఆనందము అదృశ్యము కానగ   ఎంత పరవశము..!! 
 ఆహా...! 
       *******

కామెంట్‌లు