స్ఫూర్తి దాతలు! అచ్యుతుని రాజ్యశ్రీ
 పరీక్షలు ఐపోయి రిజల్ట్ ఇవ్వడం తో కె.జి.నుంచి 8వక్లాస్ పిల్లలు చాలా ఉషారుగా ఉన్నారు.అక్కడకి ఇక్కడ కి వెళ్లాలని ప్లాన్.కానీ విపరీతమైన ఎండలు బస్సు రద్దీతో చార్జీల మోతతో అమ్మ నాన్నలు ఎటూ చెప్పలేని పరిస్థితి.ఏకాలమైనా మధ్యతరగతి బ్రతుకులు గతుకులబండీయే! ఆ అపార్ట్మెంట్ లో యు.ఎస్.నించి వచ్చిన ఓబామ్మగారున్నారు. పిల్లలని పోగేసి రోజుకోకథ క్విజ్ పోటీలు ఇష్టమైన వ్యక్తులు గూర్చి చెప్పమన్నారు.వల్లిక అంది" అమ్మమ్మా! నేను ఈరోజు ఇద్దరు మహిళల గూర్చి చెప్తాను.ఒకామె కాన్సర్ ని జయించిన కనికాటెకరీవాల్. 33ఏళ్ల ఆమె 10కన్నా ఎక్కువ జెట్ విమానాలున్నాయి. జెట్ సెటగో సి.ఇ.ఓ.ఫౌండర్ కూడా.ఇది ప్రైవేట్ జెట్ కంపెనీ.ఈమె కంపెనీ జెట్ హెలికాప్టర్లను కావాల్సిన వారికి అద్దెకి ఇస్తారు.బాగా సాంప్రదాయ మార్వాడీకుటుంబంలో పుట్టింది.తండ్రికి రియల్ ఎస్టేట్ కెమికల్ వ్యాపారం.బోర్డింగ్ స్కూల్ లో చదివి22వ ఏటజెట్ సెటగో‌అనేపేరుతో స్టార్ట్ అప్ ప్రారంభించారు.అప్పుడే కాన్సర్ వ్యాధితో బాధపడుతున్న ఆమె బిజినెస్ విషయం లో వెనుకకి తగ్గలేదు.మనదేశంలోనే ఏకైక విమాన ఎగ్రిగేటర్ బిజినెస్ ఉమన్ గా చరిత్ర సృష్టించింది.
ఇక ఎల్ ఎల్ బీ చేసి ఐ.ఎ.ఎస్ ఆఫీసర్ గా సోనాల్ గోయల్ తన శక్తిని నిరూపించారు.సి.ఎస్.కంపెనీ సెక్రటరీ గా పార్ట్ టైం జాబ్ చేస్తూ రెండో ప్రయత్నంలోనే మంచి మార్కులతో ఐ.ఎ.ఎస్.ఐంది.మన శక్తి సామర్థ్యాలు పెంచుతూ విశ్వాసం దృఢసంకల్పంతో ముందుకి సాగాలి అంటారు ఆమె." అమ్మమ్మ గారు చాలా బాగా మెచ్చు కున్నారు ఆపాపని.కాసేపు న్యూస్ పేపర్ చదివించి తప్పులు సరిదిద్దారు.పలకడం సరిగా వస్తేనే కదా రాయడం వచ్చేది.అందుకే తెలుగు హిందీ పుస్తకాలు చదవడం నేర్పుతూ పజిల్స్ ఇచ్చారు ఆమె 🌹

కామెంట్‌లు