: జీవితం అమృతమయం; -పర్వతనేని శ్రీలక్ష్మి
కుసుమ ధర్మన్న కళాపీఠం
===================

జీవిత ఎంతో చిన్నది మన చేతిలో ఉన్నది క్షణాలు మాత్రమే ..

ఏ నిమిషానికి ఏమీ జరుగునో అన్నట్లు మనవి కానివే అన్నీ..

పచ్చని ప్రకృతి అందాలు పక్షుల కీలకిలలు బంధించని అందాలేగా..

అందమే కదా ఆనందం ఆనందాలు
అన్నీ అందాలేగా..

పెట్టె చేతులు అందం, పలికే పలుకులు అందం..ఎదుటి వారికవే ఆనందాలు..

పిలిచె పిలుపులు నడిచే నడకలు అందమైనా ఇంతకు మించీ..

పక్కవాడి కడుపు నింపి, పొరుగు వాడికి సాయపడితే అదే కదా నిజమైన అందం, ఆనందం.

అన్నీ ఉన్నా.. శని అన్నట్లు, 
జీవితం వడ్డించిన విస్తరి అయినా
నిస్సారంగా..

ఏదో పోగొట్టుకున్నట్లు ఎవరూ పట్టించుకోనట్లు, సానుభూతులకై
అర్ధింపులు..

రసమయ జీవితాన్ని రోజు కూడా ఎరుగకుండా..

పిల్లాపాపల కేరింతలతో  సన్నని తొలకర్లు, చక్కని పలకరింపులతో
 జీవితం రసమయమే సుమా..

అవసరమున్నంత వరకూ వాడుకొని ఆనక కాలకూటవిషం లాంటి మాటలతో
మనసును చంపేస్తూ..

అమృత తుల్యమైన  వాక్కులతో అందర్నీ కలుపుకుంటూ..

అందరూ మనవాళ్లనుకుంటూ మంచిని పెంచుకుంటూ..

మమతల్ని కాపాడుకుంటూ  సాగిపోతుంటే జీవితం పూలతేరులా
కొనసాగును కదా.

కామెంట్‌లు