పౌష్టికాహారం; -సి.హెచ్.ప్రతాప్
 మనిషి తన దైనందిన జీవితంలో ఏపని చేసినా, చేయకపోయినా మూడు పూటలా భోంచేయడం మాత్రం తప్పనిసరి. ఎందుకంటే తింటేనా కదా మనిషి బ్రతకగలిగేది. అంతేకాకుండా మనిషి తీసుకునే ఆహారం మీదనే అతని ఆరోగ్యం కూడా ఆధారపడి ఉంటుంది.
మనిషి తన దైనందిన జీవితంలో ఏపని చేసినా, చేయకపోయినా మూడు పూటలా భోంచేయడం మాత్రం తప్పనిసరి. ఎందుకంటే తింటేనా కదా మనిషి బ్రతకగలిగేది. అంతేకాకుండా మనిషి తీసుకునే ఆహారం మీదనే అతని ఆరోగ్యం కూడా ఆధారపడి ఉంటుంది.
కాబట్టి మంచి పోషకాలతో కూడిన సమతుల్య ఆహారాన్ని భోజనంలో తీసుకోవడం ద్వారా ఆరోగ్యాన్ని చక్కగా కాపాడుకోగలం. మరి చక్కని భోజనం అంటే ఏమిటి, అంటే ఆయా వ్యక్తులకు వారి వయసు రీత్యా, వారి ఆరోగ్య పరిస్థితి దృష్ట్యా అవసరమైనదని అర్ధం.
కాబట్టి మంచి పోషకాలతో కూడిన సమతుల్య ఆహారాన్ని భోజనంలో తీసుకోవడం ద్వారా ఆరోగ్యాన్ని చక్కగా కాపాడుకోగలం. మరి చక్కని భోజనం అంటే ఏమిటి, అంటే ఆయా వ్యక్తులకు వారి వయసు రీత్యా, వారి ఆరోగ్య పరిస్థితి దృష్ట్యా అవసరమైనదని అర్ధం. పలు అధ్యయనాల ద్వార పౌష్టికాహారానికి పట్టణవాసులు దూరమవుతున్నారు అని తేలింది. అర్బన్‌, సెమీ  అర్బన్‌ ప్రాంతాల్లో శరీరానికి సరిపడినన్నీ పోషకాలు చేరడం లేదు. పట్టణాలు, నగరవాసుల ఆహార అలవాట్లపై అధ్యయనం చేసిన ఇక్రిసాట్‌ పట్టణ ప్రాంతాల్లో నివసించే మహిళలకు అవసరమమైన పోషకాలు చేరడం లేదని గుర్తించింది.ఇది చాలా దురదృష్టకర పరిణామం. మహిళలు తీసుకొనే పోషకాహారంలో పాలు, కూరగాయలు మాత్రమే ఉన్నట్లు అధ్యయనంలో తేలింది. మాంసకృత్తులు, సూక్ష్మపోషకాలు నిల్వ ఉండే డ్రై ఫ్రూట్స్‌, గుడ్లు, మాంసం, ఆకుకూరలు, విటమిన్‌ ఏ పండ్లు, కూరగాయలు, ఇతర పండ్లను తక్కువగా తీసుకుంటున్నారు తత్ఫలితంగా ఎన్నో అనారాగ్యాలకు గురవుతున్నారు.ఎదిగే పిల్లలకు పౌష్టికాహారం అవసరం. ఎదుగుతున్న పిల్లలకు పోషకాలతో కూడిన పౌష్టికాహారాన్ని అందించాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. చాలా మంది తల్లిదండ్రులు తమ పిల్లలకు పౌష్టికాహారం అందించే విషయంలో ఏమాత్రం శ్రద్ధ కనబరచటంలేదు. దీనికి అనేక కారణాలు లేకపోలేదు. పిల్లలు తల్లిదండ్రులు సూచించిన ఆహారాన్ని తినకుండా మారాం చేయటం ఒక కారణంకాగా, మరికొందరు పిల్లలు చిరుతిండి బాగా తింటారు. ఆహారంలో విటమిన్లు, ప్రొటీన్లు, కొవ్వులు, పిండి పదార్థాలు అన్నీ ఉన్నాయా, లేదా అని చూసుకుని ఆహారం అందించాల్సిన బాధ్యత తల్లిదండ్రులపైనే ఉంటుంది.ఎముకల బలానికి, కంటి చూపు మెరుగుపడటానికి మానసిక , శారీరక ఎదుగుదలకి చిన్నారులకు విటమిన్ ఎ కలిగిన ఆహారాన్ని అందించటం అవసరం. ఇందుకు గాను జున్ను, పాలు, క్యారెట్, గుడ్లు వంటి ఆహారం అందించాలి. శరీరంలో రక్తం బాగా వృద్ధిచెందటానికి, ఐరన్ లోపం తలెత్తకుండా చూసుకోవటానికి పాలకూర, ఎండుద్రాక్ష, బీన్స్ ను ఇస్తే మంచిది. శరీర దృఢత్వం కోసం , మృధువైన చర్మం కోసం టొమాటో, తాజా కూరలు, పుల్లని పండ్లు అందించటం వల్ల వారికి సి విటమిన్ లభిస్తుంది. 
కామెంట్‌లు