వింతలు విడ్డూరాలు! అచ్యుతుని రాజ్యశ్రీ

 ఏదైనా శిలా విగ్రహం పెద్ద గా అరిస్తే శబ్దం చేస్తే మనకి వింతగా అనిపిస్తుంది ఆశ్చర్యం వేస్తుంది.ప్రాచీన ఈజిప్టు నగరం థెబెస్ లో జరిగిన వింత ఇదే.ఈజిప్ట్ దేవుడు మెమ్నాన్ విగ్రహం దాదాపు 200ఏళ్లు సూర్యోదయం వేళలో అలా కీచుగా అరవటం ఓవింత. క్రీ.పూ.27 లో భూకంపం వల్ల కొంత భాగం విగ్రహం దెబ్బ తింది.అంతే హఠాత్తుగా దాని నోరు మూతపడింది.అది అరుస్తూ ఉన్న రోజుల్లో ఈజిప్టు చక్రవర్తులు ఫారోలు ఈప్రాంతంని దర్శించేవారు.వారి నమ్మకం ప్రకారం అది అలా అరిస్తే శుభం అదృష్టం అని.!క్రీ.శ.200లో విగ్రహం కి మరమ్మతులు చేశారు.ఆరిపేరు చేయడంవలన అది మరింక కుయ్ కయ్ అనకుండా చలీచప్పుడు లేకుండా ఉండిపోయింది.సూర్యోదయంలోనే ఎందుకు అది అలా గీ అంటూ కీచుగా అరిచేదంటే వేడి సూర్య కిరణాలు దాని పగుళ్లు లోకి చొచ్చుకు పోవడంతో ఆశబ్దాలు వినపడేవని శాస్త్రవేత్తల పరిశోధనలో తేలింది.దాదాపు 200 ఏళ్ళు థెబెస్ విగ్రహం అరుపులు ప్రపంచంలో వింత గా నిలిచిపోయింది 🌹
కామెంట్‌లు